తెలుగు అమ్మాయిలు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా సెట్ అవ్వరు, ఇది గ్లామర్ ఫీల్డ్ ఇక్కడ స్కిన్ షో చెయ్యాల్సి ఉంటుంది అని చాలా కామెంట్స్ విన్నాం కానీ వాటన్నింటిని పటాపంచలు చేస్తూ ప్రియాంక జవాల్కర్ కొత్త అర్ధం చెప్తోంది. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించి, టాక్సీవాలా సినిమా ద్వారా తెలుగు తెరపై మెరిసిన అనంతపురం అమ్మాయి ప్రియాంక జవాల్కర్. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో మెప్పించిన ఈ బ్యూటీకి యూత్ ఫిదా అయ్యారు. టాక్సీవాలా సినిమా హిట్ అయిన తర్వాత వరసగా ఆఫర్స్ వస్తాయనుకుంటే ఒక్క సినిమా ఆఫర్ కూడా రాలేదు.
మొదటి సినిమా హిట్ అయినా అవకాశాలు రాకపోవడంతో ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలోని యూత్ ని టార్గెట్ చేస్తూ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తోంది. ట్రెడిషనల్ వేర్ లో కూడా సెగలు పెట్టించే ఫోటోలు దిగి కుర్రకారుని హీటేక్కిస్తున్న ఈ బ్యూటీ అందాల ఆరబోతతో కుర్రాళ్లను తన మాయలో వేసుకుని నిద్ర పట్టకుండా చేస్తోంది. ప్రతి రోజూ కొత్త ఫొటోలతో ఆకట్టుకునే ఆ అమ్మడు, లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫోటోల్లో మత్తెక్కించే కళ్లతో మెరిసి పోతుంది. అందరిలా పొట్టి బట్టలు వేసుకోని స్కిన్ చెయ్యకుండా, బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ సారీ లో జిగేల్ మనిపిస్తున్న ప్రియాంక జవాల్కర్ గ్లామర్ అనే పదానికే కొత్త అర్ధం చెప్తోంది. ఆమె కళ్లలో మెరుపులు, నడుము ఒంపులు చూడురా బాబు అంటూ ప్రియాంక అందాలకి ఫిదా అవుతున్న యూత్ ఫాలోవర్స్ రూపంలో రోజురోజుకి పెరుగుతున్నారు. మరి అవకాశాల కోసం గ్లామర్ బాట పట్టిన ఈ తెలుగమ్మాయి ఇండస్ట్రీలో ఎంత వరకూ నిలబడుతుందో చూడాలి