బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న సినిమా ‘సీత’. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ లు ఇద్దరు ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ తో కలర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. పోస్టర్ అయితే కలర్ఫుల్ గా ఉంది కానీ అసలు దాంతో తేజా ఏం చెప్పాలి అనుకున్నాడో లేక ఏం చూపించాలనుకున్నాడో మాత్రం అర్ధం కాలేదు. జస్ట్ క్యాజువల్ గా హీరోహీరోయిన్లు కాలీగా ఉన్న టైంలో దిగిన సెల్ఫీకి టైటిల్ లోగో తగిలించి పోస్టర్ పేరుతో రిలీజ్ చేసినట్లు ఉంది.
బెల్లంకొండ శ్రీనివాస్ తో కాజల్ వరుసగా రెండో సినిమా చేస్తుండగా, దర్శకుడు తేజ వైవిధ్యమైన కథ తో సినిమాని తెరకెక్కిస్తున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇలాంటి జోనర్ లో తొలిసారి చేస్తుండడం విశేషం. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలో సోనూ సూద్, మన్నారా చోప్రాలు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి శీర్ష రాయ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఏకే ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.