సినిమా

Aacharya: “ఆచార్య”కి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్..!!

Share

Aacharya: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన “ఆచార్య” ఈనెల 29వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు మొత్తం బ్లాక్ బస్టర్ హిట్స్ కావటంతో “ఆచార్య” గ్యారెంటీగా విజయం సాధిస్తుందన్న ధీమాతో ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి హైదరాబాదులో యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా తెలుగు సినిమా స్థాయిని రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా చాటుతూ ఉండటంతో… చిరంజీవి జక్కన్న నీ సత్కరించడం కూడా మనం చూశాం.

Acharya Release Date: Chiranjeevi's 'Acharya' likely to be released on January 12, 2022?

ఇదిలా ఉంటే “ఆచార్య” సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. విషయంలోకి వెళితే “ఆచార్య” కి వారం రోజులపాటు 5 ఆటలకు అనుమతించింది. ఇదే సమయంలో టిక్కెట్ల రేట్లను పెంచుకోవటానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా ధియేటర్లో ఆయా క్యాటగిరి కాబట్టి టికెట్ రేట్లను పెంచుకునే వీలుగా… సినిమా థియేటర్ల యాజమాన్యం కి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Acharya trailer: Chiranjeevi and Ram Charan are comrades in arms in action romp | Entertainment News,The Indian Express

ఏడు రోజుల పాటు ఐదు ఆటల షోతో పాటుగా టికెట్ల పెంపును కూడా 7 రోజుల వరకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. “RRR” కూడా ఈ తరహాలోనే రిలీజ్ అయింది. కాగా  సినిమాకి ఫస్ట్ డే పాజిటివ్ టాక్ రావడంతో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఆచార్య కి కూడా ఫస్ట్ డే ఏ మాత్రం పాజిటివ్ టాక్ వస్తే ఓపెనింగ్ కలెక్షన్స్ భారీగా ఉంటాయి అని ట్రేడ్ వర్గాల టాక్. మరి ఆచార్య ఎలా ఉంటుందో చూడాలి. 


Share

Related posts

తెలుగులో ఆ భారీ ప్రాజెక్టు కోసం ఏఆర్ రెహమాన్!

Muraliak

Bhola shankar: నాకు ఇప్పుడు భోళా శంకర్ తప్ప ఏదీ ముఖ్యంకాదు అంటున్న స్టార్ ప్రొడ్యూసర్

GRK

Nivisha Cute Images

Gallery Desk