సినిమా

SVP: మీ ఫ్యాన్స్ గురించి చెప్పండి అడవి శేష్ ప్రశ్నకు మహేష్ అదరగొట్టే ఆన్సర్..!!

Share

SVP: “సర్కారు వారి పాట” ప్రీ రిలీజ్ వేడుక కి యంగ్ హీరో అడవి శేష్ కూడా రావటం జరిగింది. మహేష్ బాబు బ్యానర్ లో అడవి శేషు మేజర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మేజర్ జూన్ మూడో తారీకు రిలీజ్ అవుతున్న క్రమంలో.. మహేష్ సినిమా ఆధారగోడుతుందని .. తెలియజేయడం జరిగింది. అంతేకాదు అడవి శేష్ తో వర్క్ చేయడం గర్వంగా ఉందని కూడా తెలియజేశారు. ఈ క్రమంలో అడవి శేష్ పలు ప్రశ్నలను.. మహేష్ బాబుని అడిగారు.

Tell us about your fans Mahesh Adaragotte Answer to Adavi Shesh Question

సార్ నమ్రత గారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే… వెంటనే మెసేజ్ లు .. వాయిస్ రికార్డ్ పెట్టేస్తారు. మా పరిస్థితే ఇలా ఉంటే, ఒకవేళ మీరు ఫోన్ ఎత్తకపోతే… మీ పరిస్థితి ఏంటి సార్ అని మహేష్ ని ప్రశ్నించారు. నాకు అటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అయితే షూటింగ్ లేకపోతే ఇంట్లో ఉంటాను. నేను బయటకు ఎక్కువగా వెళ్ళను అంటూ మహేష్ జవాబిచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానుల ఫాలోయింగ్ ఉంది… దాని గురించి అంటూ రెండో ప్రశ్న మహేష్ నీ అడగటం జరిగింది. దానికి మహేష్.. జవాబిస్తూ.. ఏ జన్మలో చేసుకుంటే గానీ ఈ అదృష్టం ఉండదు. ఇంత మంది అభిమానులు ఉండటం నా అదృష్టం.

వాళ్ల కోసమే సినిమాలు చేస్తాను. అభిమానులను సంతోషపరచడానికి ఆనందింపజేయడానికి సినిమాలు చేస్తాను అని మహేష్ ఫ్యాన్స్ నీ ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా చివరి స్పీచ్ లో మరింతగా అభిమానులను కనెక్ట్ అయ్యేలా మహేష్ మాట్లాడటం జరిగింది. రెండేళ్లలో నాకు దగ్గరగా ఉండే వాళ్ళు చాలామంది దూరమయ్యారు అంటూ… చాలా ఎమోషనల్ గా మాట్లాడి.. మీరు మాత్రం నాకు దగ్గరగానే ఉన్నారు. రెండేళ్లలో చాలా మారాయి ఏది జరిగినా.. ఏం జరిగినా.. మీ అభిమానం మాత్రం మారలేదు. ఈ అభిమానం ఎప్పుడూ ఇలానే ఉండాలి.. ఇది చాలు ధైర్యంగా ముందుకు పోవటానికి అంటూ మహేష్ చివరిలో చాలా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు.


Share

Related posts

Acharya : రెండు వారాల్లో ఆచార్య పూర్తి .. ఆ తర్వాతే రిలీజ్ డేట్ అనౌన్స్..!

GRK

ముగ్గురిలో ఎవ‌రు ?

Siva Prasad

Shirin Kanchwala Beautiful Images

Gallery Desk