Telugu Actresses: సినిమా ఇండస్ట్రీ అంటేనే అద్భుతమైన రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అద్భుతమైన నైపుణ్యంతో పాటు అదృష్టం కూడా ఉండాలని చెప్పవచ్చు. ఇండస్ట్రీలోకి వచ్చిన ఎంతోమంది నటీనటులు కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో పనిచేస్తున్న వారికి మంచి అవకాశాలు లభించవు. కానీ కొందరు మాత్రం ఇండస్ట్రీలోకి రాగానే స్టార్లుగా మారిపోతారు. ఈ విధంగా ఎంతో మంది హీరోయిన్లు చిన్నవయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నారు. మరి టీనేజ్లోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆ హీరోయిన్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం…
1) ఇలియానా:
వైవియస్ చౌదరి దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన “దేవదాసు” చిత్రం ద్వారా ఇలియానా హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు. ఇలియానా నటించిన మొదటి సినిమానే బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ సినిమాలో నటించినప్పుడు ఇలియానా వయస్సు కేవలం 18 సంవత్సరాలు.
2) తమన్నా:
మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన” శ్రీ” సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు తమన్నా. ఈ సినిమా చేసే సమయంలో తమన్నా వయస్సు కేవలం 15 సంవత్సరాలు.
3) హన్సిక:
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన దేశముదురు సినిమా ద్వారా హన్సిక హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో నటిస్తున్న సమయంలో హన్సిక వయసు 16 సంవత్సరాలు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
4) ఛార్మి:
భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన “నీతోడు కావాలి” చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా చేస్తున్న సమయంలో చార్మి వయసు 15 సంవత్సరాలు మాత్రమే.
5) అవికా గోర్:
చిన్నారి పెళ్లికూతురు సినిమా ద్వారా ఎంతో ఫేమస్ అయినా అవికాగోర్ 16 ఏళ్లకే “ఉయ్యాల జంపాల” సినిమాలో హీరోయిన్ గా నటించారు.
6) కృతి శెట్టి:
బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సరసన “ఉప్పెన” సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన కృతి శెట్టి వయసు కూడా 17 సంవత్సరాలు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టింది.
వీరు మాత్రమే కాకుండా ఇంకా పలువురు హీరోయిన్ లు కేవలం 18 సంవత్సరాల లోపల హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యి మంచి విజయాలను అందుకున్నారు.