NewsOrbit
బిగ్ స్టోరీ సినిమా

Telugu Cinema: పోయేది నటులు – పోగొడుతున్నది నిర్మాతలు..! తెలుగు పరిశ్రమని నాశనం చేస్తున్నది నిర్మాతలేనా..!?

Telugu Cinema: “సర్… ఓ మంచి కథ ఉంది. మంచి క్రైమ్ కథ, ఇంటరెస్టింగ్ ట్విస్టులు, తెలుగు తెరపై ఇప్పటి వరకు ఇలాంటి కథ రాలేదు. కొంచెం తెలిసిన ఇద్దరు స్టార్లను పెట్టి, ఇతర చిన్న నటులను పెట్టి పాటలు, ఫైట్స్ ఏమి లేకుండా కథ ఆధారంగా తీస్తే మాంచి క్లిక్ అవుతుంది. మంచి పేరొస్తుంది” ఓ రచయిత నిర్మాతకి ఫోన్లో విషయం చెప్పాడు…!
“లేదు.. కథలో హీరో పాత్ర హైలైట్ ఉండాలి. హీరో చుట్టూ కథ తిరగాలి. కనీసం రెండు ఫైట్లు, ఒక మాస్ సాంగ్ ఉండాలి. కథని మార్చండి. హీరో పాత్రకి బలం లేదు. ఇలాగైతే ఏ హీరో సినిమా చేయరు..” ఓ నిర్మాత సమాధానం..!
“సర్.. ఇది హీరో ఆధారంగా నడిచే కథ కాదు. కథే హీరో. దీనిలో హీరో, హీరోయిన్, విలన్ అంటూ ఉండరు. చేయని క్రైమ్ లో ఇరుక్కుని.. నానా తంటాలు పడుతున్న ఇద్దరు పెద్దోళ్ల కథ. కానీ ఇంటర్వెల్, క్లైమాక్స్ లో సూపర్ ట్విస్టులు ఉంటాయి. ప్రేక్షకుడి మైండ్ బ్లాక్ అయ్యే కథ ఇది” ఆ రచయిత వాదన…!
“లేదయ్యా… హీరో లేకపోతే జనం చూడరు. ఓటీటీలో కొనరు. థియేటర్లో రిలీజ్ చేయనీయరు. మేము డబ్బులు ఎలా పెడతాం. ఇటువంటి కథలు ఇక్కడ వద్దు. తమిళనాడులో తీసుకోండి” నిర్మాత ఫైనల్ సంభాషణ…!

తెలుగు సినీ పరిశ్రమకి నిర్మాతలే విలన్లు. హీరో మార్కెట్ ని బట్టి ఒక సినిమా తీశామా..? 10, 20 శాతం లాభానికి అమ్మేశామా..!? ఎంజాయ్ చేసేసామా..!? ఓ వైపు పేరు, మరోవైపు ఎంజాయ్..? ఇంకోవైపు కొంచెం డబ్బు… ఇదీ తెలుగు పరిశ్రమలో నిర్మాతల తీరు. కథలకు విలువనివ్వకుండా.. హీరోలకు విలువనిస్తూ.., మార్కెట్ చూసుకుంటూ పరిశ్రమ బండిని లాగిస్తున్నారు. కొత్త కథలతో రిస్క్ లోకి దిగడం లేదు. లో బడ్జెట్ కి మొగ్గు చూపడం లేదు. హీరోల భజనలో, మార్కెట్ మోజులో విహరిస్తున్నారు. ఇలాగే కొనసాగితే పిజ్జా, ఫిల్మ్ బై అరవింద్, సూపర్ డీలక్స్ లాంటి ప్రయోగాత్మక చిత్రాలు ఎప్పుడొస్తాయి..? కమర్షియల్ మోజులో చిక్కుకుంటే హీరోలకు భిన్నమైన పాత్రలు ఎప్పుడు దొరుకుతాయి..!?

Telugu Cinema: Industry based on Heros not Good Stories
Telugu Cinema Industry based on Heros not Good Stories

Telugu Cinema: హీరోలు – మార్కెట్ కొలమానంగా కథలు..!!

తెలుగు సినీ పరిశ్రమలో రచయితలకు కొదవ లేదు. కానీ కొత్త కథలకు, కొత్త తరహా టేకింగ్ కి కొదవ ఉంది. దీనికి కారణం నిర్మాతలే. ఏ కథ తీసుకున్నా దీనిలో ఏ హీరోని పెట్టాలి..? ఆ హీరో మార్కెట్ ఎంత..? ఎంత బడ్జెట్ పెట్టొచ్చు..? కథలో హీరోని హైలైట్ చేయాలంటే ఏం చేయాలి..? అదనంగా ఎన్ని సీన్లు చేరిస్తే హీరో పాత్ర హైలైట్ అవుతుంది..!? ఇదే ఆలోచనల్లో నిర్మాతలు ఉంటున్నారు.
* ఇటీవల ఓటీటీల్లో ఆకట్టుకున్న కొత్త తరహా కథలన్నీ నేరుగా తెలుగులో తీసినవి కాదు… శక్తి (శివ కార్తికేయన్).., జల్లికట్టు, వైరస్, మాధ, మాయ, టూ లెట్, వన్ వంటి కథలు భిన్నమైనవి. ఇవన్నీ నేరుగా తెలుగులో నిర్మించినవి కాదు, ఇతర భాషల నుండి తెలుగులోకి డబ్బింగ్ చేయగా.. హిట్ అయిన సినిమాలు. కానీ వీటిలో కొన్ని కథలు ముందుగా తెలుగు నిర్మాతలు వింటే.. వాటిని రిజెక్ట్ చేసిన ఫలితంగా అక్కడకు వెళ్లి సినిమాలు రూపొందాయి. పక్క భాషలో హిట్టయితే తెలుగులోకి డబ్బింగ్ చేసుకోడానికి, తెలుగులోకి రీమేక్ చేయడానికి నిర్మాతలకు ధైర్యం ఉంటుంది.. కానీ కథని నమ్మి హీరోలకు, నటులకు సంబంధం లేకుండా కేవలం పాత్రలను ఆధారంగా సినిమా నిర్మించే డెడికేషన్ ఏ నిర్మాతలోనూ ఉండడం లేదు. అందుకే ముందుగా ఒక కథ సిద్ధం చేయకుండా… ఒక హీరోని అనుకుని.. ఆయనకు తగిన సీన్లు రాసుకుని.. ఆ సీన్లు అన్నీ కలిపేసి ఒక కథని రాసుకుని తీసేస్తున్నారు. ప్రేక్షకులు మీదకు వదిలేస్తున్నారు. అంతా బాగుంటే క్రాక్ తరహాలో కథ కాకుండా సీన్లు పరంగా కమర్షియల్ హిట్ కొడుతున్నారు. లేకపోతే పక్కకెళ్లి ఆడుకుంటున్నారు..!

Telugu Cinema: Industry based on Heros not Good Stories
Telugu Cinema Industry based on Heros not Good Stories

కేవలం వ్యాపారమే పరమావధి..!!

“ప్రజెంట్ ట్రేండింగ్ లో ఉన్న ఆరుగురు కుర్ర హీరోలకు అడ్వాన్స్ ఇచ్చేసాము. మంచి కథలు వింటున్నాము. కథలు వింటున్నా.. వారి పాత్రలు సరిగా లేని కారణంగా చేయడం లేదు. మార్కెట్ లో సేఫ్ గా ఉండేలా కథలు ఉండాలి” అంటూ నిర్మాతలు అంతరంగికంగా సంభాషించుకుంటున్నారు. కథ కంటే ఏ హీరోకి కనెక్ట్ అవుతుంది..? ఎంత బడ్జెట్ అవుతుంది..? ఎంత రాబడుతుంది..? అనేది ముఖ్యం. సినీ పరిశ్రమలో నూటికి నూరుశాతం నిర్మాతల వైఖరి ఇలాగే ఉంది. కథపైనా, సినిమాపైనా ప్రేమ, డెడికేషన్ కంటే వ్యాపారం, మార్కెట్, ఎంజాయ్ పై ఎక్కువ మోజు ఉంది. ఇటీవల కొత్తగా వస్తున్న నిర్మాతలు కూడా తాము వింటున్న కథల్లో హీరో, హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యతలు ఇస్తున్నారు తప్ప కథలో శ్రద్ధ వహించడం లేదు. అందుకే కొత్త రచయితలు రావడం లేదు. ఉన్న ఆ పాత రచయితలే హిందీ, ఇంగ్లీష్, తమిళ్ సినిమాలోని సీన్లు చూసుకుంటూ ముందుగానే ఒక హీరో అనుకుని.. వారికి అనుగుణంగా కొన్ని హైలైట్ సీన్లు రాసుకుని.. ఆ తర్వాత దాన్ని కథగా మారుస్తున్నారు.. దాన్ని నిర్మాతలకు ఇచ్చి భేష్ అనిపించుకుంటున్నారు. ఇదీ తెలుగు పరిశ్రమ ఖర్మ…!!

author avatar
Srinivas Manem

Related posts

Kumkuma Puvvu April 20 2024 Episode 2160: అంజలి నిశ్చితార్థాన్ని చెడగొడుతుందా లేదా.

siddhu

Mamagaru April 20 2024 Episode 191: గంగాధరికి బోనస్ గా మూడో ముద్దు పెట్టిన గంగ, షాక్ అయినా గంగాధర్..

siddhu

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri