న్యూస్ బిగ్ స్టోరీ సినిమా

తెలుగు సినిమాకు దిక్సూచి ‘అక్కినేని’.. పరిపూర్ణం ‘నాగేశ్వరరావు’ జీవితం..

telugu cinema pride akkineni nageswara rao
Share

‘అక్కినేని’.. ఈ పేరు తెలుగు సినిమాకు ఓ బ్రాండ్… తెలుగు సినిమాకు దిక్సూచీ. తెలుగు సినిమాను భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలో కూడా మేటిగా నిలబెట్టిన తొలితరం మహానటుడు, నట విశ్వరూపం.. ‘అక్కినేని నాగేశ్శరరావు’ అంటే అతిశయోక్తి కాదు. కళను ఆరాధించడం వేరు.. కళనే శ్వాసగా భావిస్తూ జివించడం వేరు. ఈ రెండో కేటగిరీకి చెందిన వ్యక్తే అక్కినేని. ఎందుకంటే.. నూనుగు మీసాల ప్రాయంలో సినిమాలో నటనతో అక్కినేని నట ప్రయాణం మొదలుపెట్టారు. 1941లో ధర్మపత్నితో మొదలైన ఆయన సినీ ప్రయాణం.. 2014లో విడుదలైన ‘మనం’ సినిమా వరకూ కొనసాగుతూనే ఉంది. ఈ తరహా రికార్డు మరే హీరోకు కానీ.. నటులకు కానీ భవిష్యత్తులో సాధ్యమయ్యే విషయం కాదు. జనవరి 22 ఆయన పరమపదించిన రోజు. ఈ సందర్భంగా..

telugu cinema pride akkineni nageswara rao
telugu cinema pride akkineni nageswara rao

1923 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లాలోని గుడివాడ ప్రాంతంలోని రామాపురం లో అక్కినేని నాగేశ్వర రావు జన్మించారు. పెద్దగా చదువుకోలేదు. కళలపై మక్కువతో నాటకాల్లో వేషాలు వేసేవారు. ముఖ్యంగా ఆడ వేషంలో అచ్చం అమ్మాయిలానే ఉండేవారు. 16 ఏళ్ల వయసులో నాగేశ్వరరావును విజయవాడ రైల్వే స్టేషన్ లో చూసిన ఘంటసాల బలరామయ్య.. సినిమాల్లో నటిస్తావా అని అడగడమే.. సుదూర తెలుగు సినిమా భవిష్యత్తుకు నాంది అయింది. అప్పటికే 1941లో ‘ధర్మపత్ని’ అనే సినిమాలో 17 ఏళ్ల వయసులోనే చిన్న పాత్రలో నటించారు. 1944లో వచ్చిన శ్రీ సీతారామజననం, బాలరాజు, కీలుగుర్రం, లైలా మజ్ను, స్వప్నసుందరి, పల్లెటూరి పిల్ల వంటి సినిమాలు ఆయనకు గుర్తింపును తెచ్చిపెట్టాయి.

మిస్సమ్మ, దొంగరాముడు, మాయాబజార్ వంటి ఐకానిక్ హిట్స్ తో దూసుకెళ్లారు తెలుగు సినిమాలకు సంబంధించి అక్కినేని తొలి స్టైలిష్ హీరో. ఆయన సిగరెట్ కాల్చే స్టయిల్, స్టైలిష్ ఎక్స్ ప్రెషన్, మందు గ్లాసు పట్టుకునే స్టయిల్, తెలుగు సినిమాల్లో నిలిచిపోయాయి. డ్యాన్సుల్లో కూడా అక్కినేని తొలి సూపర్ స్టార్. పౌరాణికంగానూ అక్కినేని తన నటనా సామర్ధ్యాన్ని నిరూపించారు. భక్తుడి పాత్రల్లో రాణించారు. అయిదో తరగతే చదివినా.. క్రమంగా హిందూ పేపర్ చదివి ఇంగ్లీషు భాషపై పట్టు సాధించిన ఘనాపాఠి అక్కినేని. నటుడిగానే కాకుండా అక్కినేని తెలుగు సినీ పరిశ్రమకు చేసిన మేలు చరిత్రలో నిలిచిపోయింది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, రఘుపతి వెంకయ్య, దాదాసాహెబ్ ఫాల్కే.. వంటి అవార్డులు ఆయన సొంతం.

తెలుగు సినిమా మద్రాసులో కాదు.. తెలుగు రాష్ట్రంలోనే ఉండాలని తొలిగా సంకల్పించింది అక్కినేని. తెలుగు సినిమా హైదరాబాద్ రావడంలో కీలకపాత్ర పోషించారు. 1976లోనే హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం చేసి క్రమక్రమంగా విస్తరించారు. నేడు అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు సినిమాకు గుండె. సినిమా షూటింగ్స్, సీరియల్స్, రియాల్టీ షోస్, ఉపాధి అవకాశాలు, కొత్త కొత్త కోర్సులతో సినిమా పాఠాలు.. ఇలా అన్నపూర్ణ స్టూడియోస్ దినదిన ప్రవర్ధనం అయింది. ఎదంరికో ఉపాధినిచ్చే కల్పతరువు అయింది. ఆయన నటనా వారసుడిగా అక్కినేని నాగార్జున సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి తండ్రి వారసత్వాన్ని ఘనంగా చాటి సూపర్ స్టార్ అయ్యారు. కోడలు అమల, మనవళ్లు నాగ చైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్, సుప్రియ.. ఇలా తెలుగు సినిమాల్లో అక్కినేని కుటుంబం మహా వృక్షమైంది. సినిమా చేస్తూనే తనువు చాలించాలనే ఆయన కోరిక ‘మనం’ సినిమా ద్వారా తీరింది. ఈ సినిమా కథ అక్కినేని కుటుంబం కోసమే పుట్టిందా అనేట్టు ఉంటుంది. ‘మనం’ సినిమా చేసి విడుదలకు ముందే ఆయన ఈ లోకాన్ని వీడారు. ఎటువంటి ఒత్తిడులకు లోనుకాని ప్రశాంత జీవితం గడిపారు అక్కినేని. రేపు ఆయన వర్ధంతి సందర్భంగా స్మరించుకుంటూ..

1949.. కీలుగుర్రం అక్కినేనిని చలాకీ కుర్రడిగా చూపించింది. తెలుగు జానపద చిత్రాల్లో అక్కినేని మెరిపులు మెరిపించిన సినిమా ఇది. ఈ సినిమాతో మరెన్నో జానపద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా అక్కినేని నిలిచారు.

1953.. దేవదాసు అక్కినేనిని స్టార్ ను చేసేసింది. ప్రేమ విఫలమై, మద్యానికి బానిసైన పాత్రకు ఆయన భారతీయ సినిమాకు ఐకనిక్ సింబల్ గా నిలిచిపోయారు. ఇన్నేళ్లలో ఆ పాత్రను దేశంలో మరెంతోమంది చేసినా అక్కినేనిని మరిపించలేక పోయారు.

1956.. తెనాలి రామకృష్ణ సినిమాలో కవిగా ఆ పాత్రలో జీవించారు అక్కినేని. వికటకవి.. అనే పాత్ర నైజాన్ని ఆయన అద్భుతంగా పండించారు. ఎంతో చాలాకీగా ఆయన నటించి మెప్పించారు.

1971.. దసరాబుల్లోడు సినిమా ఓ సంచలనం. పంచెకట్టులో పల్లెటూరి వ్యక్తిగా అక్కినేని తెలుగుదనాన్ని అద్భుతంగా చూపించారు. ఆ సినిమాలో అక్కినేని, వాణిశ్రీ జంట ప్రేక్షకుల్ని కనునవిందు చేసింది. ఇదే ఏడాది వచ్చిన ప్రేమనగర్ ఓ సంచలనం. ప్రేమ విఫలమైన పాత్రలో మద్యానికి బానిసైన పాత్రలో ఆయన స్టయిల్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది.

1981.. ప్రేమాభిషేకం సినిమా ఓ అద్భుతం. ఇద్దరు హీరోయిన్ల మధ్య అక్కినేని నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసింది. ఈ సినిమా దాదాపు 8 సెంటర్లలో 365 రోజుల చొప్పున ఆడింది.

1991.. సీతారామయ్య గారి మనవరాలు.. వయసుకు తగిన పాత్రలో అక్కినేని నటన ఆయనకు కీర్తి కిరీటంలా నిలిచిపోయింది. కుటుంబ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.

2014.. మనం.. ఇటువంటి అపురూపమైన సినిమా మరెవరికీ దక్కకపోవచ్చు. కుమారుడు, మనవడితో కలిసి ఇంత అద్భుతమైన స్క్రిప్టు అక్కినేని వంశం కోసమే పుట్టిందా అన్నట్టు ఉంటుంది. ఈ సినిమా చేసి అనారోగ్యంతో ఉన్నా బెడ్ మీదే డబ్బింగ్ చెప్పారు. వేరొకరితో డబ్బింగ్ చెప్తే పాత్రకు నిండుదనం రాదనే ఆయన అంకితభావానికి ఇది నిదర్శనం.

 


Share

Related posts

Bhumika: ఆ సూప‌ర్ హిట్ సాంగ్‌కి భూమిక డ్యాన్స్ ఇర‌గ‌దీసిందిగా.. వీడియో వైర‌ల్‌!

kavya N

Shampoo: మీరు తలస్నానం చేసేటప్పుడు చేసే తప్పులు ఇవే..!! ఇలా ట్రై చేసి చూడండి..!!

bharani jella

Shruti Haasan: ఆ మాట‌లు చాలా బాధ పెట్టాయి.. శ్రుతి హాస‌న్ ఆవేద‌న‌!

kavya N
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar