Kavitha Gowda: చందన్ కి జరిగిన అవమానానికి భార్య కవిత గౌడ తెలుగు ఇండస్ట్రీ పై సంచలన నిర్ణయం..!!

Share

కవిత గౌడ తెలుగు ఇండస్ట్రీ పై సంచలన నిర్ణయం..!!

కవిత గౌడ: కన్నడ నటుడు టీవీ సీరియల్ లో హీరోగా నటిస్తూ మంచి క్రేజ్  సంపాదించుకున్న చందన్ కుమార్ పై ఇటీవల తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జీవితకాలం బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే.

 

In Picture: Kavitha Gowda Image Credit: Kavitha Gowda Instagram

“సావిత్రమ్మ గారి అబ్బాయి” సీరియల్ ద్వారా మంచి పేరు సంపాదించిన చందన్ కుమార్.. ఇటీవల “శ్రీమతి శ్రీనివాస్” సీరియల్ లో నటిస్తున్న సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ ని ఇష్టానుసారంగా బూతులు తిట్టడంతో పాటు అతనిపై చందన్ కుమార్ చేయి చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు తెలుగు ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడటం జరిగింది. ఈ పరిణామంతో చందన్ కుమార్ నీ శాశ్వతంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తూ టీవీ సీరియల్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

కవిత గౌడ పై ప్రత్యేక కథనం

ఈ క్రమంలో భర్త చందన్ కుమార్ కి జరిగిన అవమానం పట్ల భార్య నటి కవిత గౌడ సంచలన నిర్ణయం తీసుకుంది. విషయంలోకి వెళ్తే కవిత గౌడ కూడా తెలుగు సీరియల్స్ లో ఇక నుండి నటించకూడదని నిర్ణయం తీసుకుంది.

 

In Picture: Kavitha Gowda Image Credit: Kavitha Gowda Instagram

కవిత గౌడ కన్నడ సీరియల్ “లక్ష్మీ బరమ్మ” ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. తెలుగులో ఈమె ఒకే ఒక సీరియల్ లో నటించడం జరిగింది. అయితే తన భర్త చందన్ కుమార్ కి జరిగిన అన్యాయం కారణంగా తెలుగు సీరియల్స్ లో  నటించకూడదని లేటెస్ట్ గా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Related Telugu Cinema News: `బింబిసార‌`పై ఫ‌స్ట్ రివ్యూ.. క‌ళ్యాణ్ రామ్ హిట్ కొడ‌తాడా..?

కవిత గౌడ సంచలన నిర్ణయం

ఇక ఇదే సమయంలో తన భర్త పై దాడికి పాల్పడిన ముగ్గురు టెక్నీషియన్ లపై కూడా తెలుగు సీరియల్ అసోసియేషన్ చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా ఇటువంటి క్లిష్ట సమయంలో  కన్నడ ఇండస్ట్రీ నుండి సపోర్ట్ రావటం లేదని కవిత గౌడ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. తన భర్తకి తన మద్దతు ఉంటుందని కవిత గౌడ పేర్కొంది.

In Picture: Kavitha Gowda Image Credit: Kavitha Gowda Instagram

ఇదిలా ఉంటే మొదటి నుండి కవిత గౌడ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఆమె పేరు కన్నడ ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉండేది. గతంలో కన్నడ బిగ్ బాస్ సీజన్ 2లో… తనపై తోటి కంటెస్టెంట్ ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు షో అయిపోయాక కవిత గౌడ మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది.

Related Telugu Cinema News: పెళ్లి పీట‌లెక్క‌బోతున్న హ‌న్సిక‌.. ఇంత‌కీ వ‌రుడు ఎవ‌రో తెలుసా?

ఆ టైంలో ఆమె పేరు కన్నడ టీవీ న్యూస్ ఛానల్స్ లో మారుమొగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగు టెక్నీషియన్ లపై దురుసుగా ప్రవర్తించిన చందన్ కుమార్ పై తెలుగు సీరియల్ అసోసియేషన్ జీవిత కాలం పాటు బ్యాన్ వేయటం పట్ల కవిత గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. కన్నడ ఇండస్ట్రీ ఈ విషయంలో కలుగజేసుకోవాలని కవిత గౌడ కోరుకొంటుంది.

 

 

 


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

34 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago