తెలుగు క్లాసిక్ మూవీ ఆఫ్ ది వీక్: ఇప్పటివరకు తెలుగు చలనచిత్ర చరిత్రలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుకి ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ఒక తెలుగు చిత్రం ఉండడం స్వాతిముత్యం 1986 కే దక్కింది.
పొట్ట కోస్తే అక్షరం ముక్క రానివాడు, వెర్రి వెంగళప్ప, శుద్ధ మొద్దవతారం, అమాయక చక్రవర్తి ఇలాంటి లక్షణాలు ఉన్న పాత్రను హీరోగా చేసి ఎవరైనా సినిమా తీస్తారా.!? దానికి తోడు ఆ హీరో వితంతువు మెడలో తాళి కట్టి ఆమెకు అండగా నిలబడతాడు..! ఇలాంటి కథతో సినిమా తీయడానికి ఆదర్శకుడికి ఎంతో గట్స్ ఉండాలి.!? ఆ నిర్మాతకి ఎన్ని సొమ్ములు ఉండాలి.!? తన అభిరుచి మీద నమ్మకం కథ మీద ఉన్న ఆత్మవిశ్వాసమే నిర్మాతలతో ఓ పెద్ద సాహసానికే పూలుకునేలా చేసింది.! అయితే ఆ సినిమా వాళ్ళ పరువు దక్కించడమే కాకుండా.. తెలుగు సినిమా ప్రతిష్టను మరింత ఇనుముడింప చేసే లాగా చేసింది..! కొమ్ములు తిరిగిన సినీ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ.. నాన్ వెజిటేరియన్ ట్రెండ్ టైంలో రూపొందిన ఫక్త్ వెజిటేరియన్ ఫిలిం స్వాతిముత్యం..!!

దుమ్మురేపిన స్వాతిముత్యం 1986 కలెక్షన్స్..!
మార్చి 13 1986న స్వాతిముత్యం విడుదలైంది.. అంటే నేటికీ 36 ఏళ్ళు.. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, కళాతపస్వికే విశ్వనాథ్ కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన ఈ ముత్యం 1986 బాక్సాఫీస్ ఊచకోత కలెక్షన్లను వసూలు చేసింది.. ఈ సినిమా తెలుగులో 25 కేంద్రాలలో శత దినోత్సవాలు ప్రదర్శించబడింది. కమలహాసన్ ఈ సినిమా ద్వారా తొమ్మిది లక్షల రెమ్యూనరేషన్ మాత్రమే అందుకున్నా కానీ.. అంతకు పదిరెట్లు గుర్తింపును పేరును సంపాదించుకున్నారు.
మిగతా భాషల్లో స్వాతిముత్యం 1986 డబ్బింగ్..
స్వాతిముత్యం సినిమాని ఒకటి కాదు రెండు కాదు మూడు భాషలలో డబ్బింగ్ చేశారు. ఈ సినిమాని రష్యన్ భాషలో డబ్ చేయరా అక్కడ కూడా ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమానే తమిళంలో సిపిక్కుల్ ముత్తుగా విజయ ఢంకా మోగించింది. హిందీలో ఈశ్వర్ పేరుతో 1987వ సంవత్సరంలో అనిల్ కపూర్ విజయ్ శాంతి లతో నిర్మించారు. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ డూపర్ కలెక్షన్లను వసూలు చేసింది. కన్నడ లో స్వాతిముత్తుగా 2003 వ సంవత్సరంలో సుదీప్ మీనాలతో నిర్మించారు. కర్ణాటకలో 500 కు రోజులకు పైగా ఈ సినిమా ఆడిందంటే స్వాతిముత్యం కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తెలుగు సినిమా సంబంధిత లింకులు:
Itlu Maredumilli Prajaneekam Review: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం రివ్యూ..!
తెలుగు క్లాసిక్ మూవీ ఆఫ్ ది వీక్: స్వాతిముత్యం 1986 ఆస్కార్ బరిలో..
స్వాతిముత్యం సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారంతోపాటు బంగారు నందిని అందుకుంది. దర్శకత్వ విభాగంలో ఫిలింఫేర్ విజేతగా నిలిచింది. కమల్ హాసన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు..
ఇప్పటివరకు తెలుగు చలనచిత్ర చరిత్రలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుకి ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ఒక తెలుగు చిత్రం ఉండడం స్వాతిముత్యం కే దక్కింది.

ఎన్టీఆర్, చిరంజీవి మాటల్లో స్వాతిముత్యం 1986..
స్వాతిముత్యం శత దినోత్సవ వేడుకలలో నందమూరి తారక రామారావు కూడా హాజరయ్యారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఆయన హాజరు అయిన మొదటి శత దినోత్సవ ఫంక్షన్ ఇదే కావటం మరో ప్రత్యేకత. కమల్ హాసన్ నటన గురించి , కళాతపస్వి కే విశ్వనాథ్, నిర్మాత గురించి ఎన్నో విషయాలను ఆయన సమావేశంలో పంచుకున్నారు. అదే ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి కూడా ఈ సినిమాపై పలు ఆసక్తికర విషయాలను మాట్లాడారు.
స్వాతిముత్యం సినిమా చూసిన నేను మంత్రం ముద్దులను అయ్యాను. వారం రోజులపాటు పాటు ఇప్పటివరకు నేను చేసింది కూడా నటనేనా అని అనుకున్నాను. కొద్దిగ గొప్ప విచక్షణ ఉన్న నన్నే కమలహాసన్ నటన మాయలో పడేసింది అంటే సాధారణ ప్రేక్షకులు ఇంకెంత మాయలో పడ్డారో అంటూ.. కమల్ హాసన్ నటన అద్భుతం మాలాంటివారు గైడ్లైన్స్ గా పెట్టుకోవాలి లైబ్రరీలో ఉపయోగపడేలాగా భద్రపరచాలి అంటూ.. ఈ సినిమా శత దినోత్సవ వేడుకల్లో చిరంజీవి మనస్ఫూర్తిగా మాట్లాడిన మాటలు ఇవి.

స్వాతిముత్యం 1986 లో నటించిన అల్లు అర్జున్..
స్వాతిముత్యం సినిమాలో నేటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా నటించారు. కమల్ హాసన్ మనవళ్ళులో ఒకడిగా బన్నీ బాలనుడిగా నటించాడు. ఈ సినిమా మొదట్లో కమల్ హాసన్ మనవళ్లుగా కొంతమంది నటించి అలరించారు. వారిలో మన అల్లు అర్జున్ కూడా ఒకరు. ఆ సినిమాలో నటించిన మిగతా అందరూ బన్నీకి కజిన్స్. ఈ సినిమాలో నటించడం నా అదృష్టమని బన్నీ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు.
మీరు స్వాతిముత్యం 1986 పూర్తి సినిమాని ఇక్కడ చూడవచ్చు
తెలుగు సినిమా సంబంధిత లింకులు:
Kantara: నెటిజన్స్ ను తీవ్రంగా నిరాశ పరిచిన కాంతార..! రిషబ్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్స్..!