Telugu Movies: కరోనా రెండో దశ దెబ్బ సినీ పరిశ్రమకు బాగా పడినట్టే కనిపిస్తుంది. మొదటి దశ కారణంగా కొన్ని పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి.. కొన్ని ఓటీటీల్లో విడుదలయ్యాయి. టైం చూసుకుని గత ఏడాది నవంబరు, డిసెంబర్ ఆఖరు, జనవరి నెలల్లో దించేశారు. కొన్ని చిన్న చిన్న సినిమాలను (శ్రీకారం, జాతి రత్నాలు, షాదీ ముబారక్, జాంబిరెడ్డి, ప్లే బ్యాక్, పవర్ ప్లే, ఏ వన్ వంటివి) మార్చి నెలలో వరుసగా దించేశారు. ఇక ఏప్రిల్ రెండో వారం నుండి పెద్ద సినిమాల పండగ వస్తుంది అనుకున్న సమయంలో కరోనా రెండో దశ దెబ్బ మొదలయింది. దీంతో ఇప్పటికే సందడి చేయాల్సిన ఆచార్య.., అఖండ.., విరాట పర్వం సహా చాలా వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఆగిన సినిమాలు, త్వరలో రావాల్సిన సినిమాలు అన్ని కలిపి దసరా నాటికి రావచ్చు. అదే జరిగితే దసరా నెల బిగ్గెస్ట్ సీజన్ గా మారుతుంది..!
Must Read: BB – 3 Gift for Nandamuri Fans..!
Telugu Movies: రావాల్సినవి ఇవే..!
ఆచార్య, పుష్ప, అఖండ, రాధేశ్యామ్ వంటి భారీ సినిమాలు సహా నారప్ప, లవ్ స్టోరీ, విరాటపర్వం, ఖిలాడీ వంటి చాలా సినిమాలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికే పుష్ప, ఆచార్య, అఖండ వంటి సినిమాలు భారీ బడ్జెట్ పెట్టేసి రిలీజ్ కోసం వేచి చూస్తున్నాయి. ఇవి కచ్చితంగా దసరాకు రావాల్సిందే. లేకపోతే నిర్మాతలకు ఆర్ధిక కష్టాలు వచ్చి పడతాయి. వెంకటేష్ కి నారప్ప విడుదలైన నెలరోజుల్లోనే దృశ్యం 2.. అక్కడికి మూడు నెలల గ్యాప్ లో ఎఫ్ 3 రెడీగా ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు దసరాకి వచ్చినా.. కొన్ని మాత్రం సంక్రాంతికి వాయిదా వేసే అవకాశం ఉంది. ఇప్పటికే సంక్రాంతి పోటీలో తెలుగు పరిశ్రమలో టాప్ స్టార్లుగా ఉన్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల సర్కారువారిపాట.. హరహరవీరమల్లు ఉండడంతో .. ఆ సమయంలో విడుదల చేయడానికి మరో పెద్ద సినిమా సాహసం చేయకపోవచ్చు. అయితే సంక్రాంతి అంటే జనవరి 11 నుండి 14 మధ్యలో మూడు, నాలుగు సినిమాలకు అవకాశం ఉంటుంది. మళ్ళీ జనవరి 26 కూడా సెంటిమెంట్ గా ఉంటుంది. సో.. రానున్న దసరా, సంక్రాంతికి తెలుగు పెద్ద సినిమాల పండుగలుగా మారనున్నాయి..!
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!