సినిమా

RRR: భయాందోళనలో “ఆర్ఆర్ఆర్”… “రాధేశ్యామ్” సినిమా యూనిట్ లు..!!

Share

RRR: “ఆర్ఆర్ఆర్”(RRR)… “రాధేశ్యామ్”(Radheyshyam) రెండు సినిమాలు పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాహుబలి(Bahubali) తర్వాత రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్” షూటింగ్ జరుపుకోవడంతో సినిమాపై అంచనాలు ప్రపంచ వ్యాప్తంగా భారీగా ఏర్పడ్డాయి. దాదాపు 600 కోట్ల రూపాయలతో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలు ఎన్టీఆర్(Ntr), రామ్ చరణ్(Ram Charan) తో పాటు బాలీవుడ్ బడా నటీనటులు హీరోయిన్ అలియా భట్(Alia Bhatt).. నటించడంతో సినిమా రిలీజ్ కోసం.. దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్నారు.

Prabhas & Pooja Hegde's Radhe Shyam is just a step away from the grand  release! - Tamil News - IndiaGlitz.com

ఇదే తరుణంలో ప్రభాస్(Prabhas) నటించిన “రాధేశ్యామ్”…సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన గా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలు ఎప్పుడో రిలీజ్ కావల్సి ఉండగా మహమ్మారి కరోనా కారణంగా.. వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఎట్టకేలకు ఈ సంక్రాంతికి ఈ సినిమాలు రిలీజ్ అవుతూ ఉండగా కరోనా కొత్త వేరియంట్.. ఒమిక్రన్ కేసులు పెరుగుతూ ఉండటం తో పాటు మరో పక్క రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ పై ఆంక్షలు విధిస్తూ ఉండటంతో..పాన్ ఇండియా లెవెల్ లో.. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అవుతున్న “ఆర్ఆర్ఆర్”… “రాధేశ్యామ్” సిని మేకర్స్ ఆందోళనలో ఉన్నట్లు సమాచారం.

RRR And Radhe Shyam Releases In Big Tension

పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిక్కెట్ల ధరల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు “ఆర్ఆర్ఆర్”… “రాధేశ్యామ్” సినిమా యూనిట్ లో రిలీజ్ విషయంలో పునరాలోచనలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈసారి గనుక మళ్ళీ వాయిదా పడితే ప్రభుత్వాలు లాక్ డౌన్ లు పెడితే.. భారీ వ్యయంతో సినిమాలను నిర్మించిన నిర్మాతలు నిండా మునిగి పోతారు అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దాదాపు రెండు సినిమాల బడ్జెట్ చాలావరకు వెయ్యి కోట్ల దగ్గరలో ఉంటుందని.. దీంతో కేసులు పెరిగితే ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయో అని.. రెండు సినిమాల యూనిట్లు ఆలోచనలో పడినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.


Share

Related posts

Sarkaru Vaari Paata: బ్రేక్ ఈవెన్ దిశ‌గా `స‌ర్కారు పారి పాట‌`.. ఇంకా రావాల్సింది ఎంతంటే?

kavya N

“పుష్ప 3” గురుంచి ఫాహద్ ఫాజిల్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Rajamouli Mahesh Babu: ఎస్ ఎస్ రాజమౌళి తర్వాత మహేష్ బాబుతో ఆ టాప్ మాస్ డైరెక్టర్ ప్రాజెక్ట్..??

sekhar