అజిత్ విశ్వాసం పెంచాడు…

66 views

తమిళ స్టార్ అజిత్ నటిస్తున్న లెటేస్ట్ చిత్రం విశ్వాసం. తమిళనాడులోని ఓ పల్లె నేపథ్యంలో మాస్ చిత్రాల శివ తెరకెక్కిస్తున్నఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్ స్టార్ట్ చేసిన చిత్రటీమ్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు..ఈ ట్రైలర్ చూస్తుంటే హైవోల్టేజీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది.

తెల్లజుట్టుతో ఉన్న అజిత్ లుక్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటుంద. కత్తి పట్టుకొని ఊర మాస్ లెవెల్లో యాక్షన్ సీన్స్ తో విశ్వరూపం చూపిస్తున్నాడు అజిత్. ఈ హీరోకు జోడీగా నటిస్తున్న నయనతార అందం ఆడియన్స్ ఆకట్టుకంటుంది. ఇందులో విలన్ పాత్రలో నటిస్తున్నజగపతిబాబు స్టైలిష్‌ విలన్ కనిపిస్తున్నాడు. మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఈసినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. ట్రెలర్ అదిరిపోయేలా ఉండడంతో ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు తల ఫ్యాన్స్.

.ఈ సినిమాలో అజిత్‌ ఊరి జనం కోసం బతికే వ్యక్తిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాని తమిళ నేటివిటీకి తగ్గట్లుగా దర్శకుడు శివ తెరకెక్కిచాడని తెలుస్తోంది.ఇంతకుముందు ఈ కాంబోలో వచ్చిన వీరం, వేదాలం, వివేగం సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. దీంతో విశ్వాసం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీతో శివ, అజిత్ హ్యాట్రిక్ హిట్ అందుకుంటారో లేదో చూడాలి.