DSP Thaman: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ దేవి శ్రీ ప్రసాద్, తమన్. ఇద్దరికిద్దరూ తమదైన శైలిలో బాణీలు అందిస్తూ ఉంటారు. గతంలో దేవిశ్రీప్రసాద్ హవా… కొనసాగగా ప్రస్తుతం తమన్ హవా కొనసాగుతోంది. వరుసపెట్టి ఆఫర్లు తమన్ అందుకుంటున్నాడు. అలా వైకుంఠపురం నుండి తమన్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ ప్రాజెక్టులు అందుకుంటూ .. సినిమా విజయం సాధించడం లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో తన బెస్ట్ ఇస్తున్నాడు. అఖండ, బీమ్లా నాయక్.. ఇంకా చాలా సినిమాలు ఇటీవల విజయాలు సాధించడంలో..తమన్ పాత్ర కీలకంగా మారింది.
ఇదిలా ఉంటే ఆహా ఓటిటి లో… తెలుగు ఇండియన్ ఐడిల్ ఈ కార్యక్రమానికి తమ జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఎపిసోడ్ లో ఓ సింగర్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలను పాడటం జరిగింది. ఆ పాట పై..తమన్ కామెంట్ చేస్తూ.. దేవి శ్రీ ప్రసాద్ ని పొగడ్తలతో ముంచెత్తారు. డిఎస్పి ఒక కొరియోగ్రాఫర్ గా… డాన్సర్.. మ్యూజిషియన్ గా మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని పేర్కొన్నారు. దేవి శ్రీ ప్రసాద్ కి ఒక పాట కి ఎలా కొరియోగ్రాఫర్ చేయాలో కూడా తెలుసు.
సాంగ్ ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ “ఆహా” లో.. అనేదానిపై ఆయనకి మంచి కమాండ్ ఉంది..అంటూ తమన్ పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో దేవిశ్రీప్రసాద్ తమన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో స్పందించి థాంక్ యు డార్లింగ్ బ్రదర్… సో స్వీట్ ఆఫ్ యు.. అంటూ ట్వీట్ చేయడం జరిగింది. మొదటి నుండి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ ల మధ్య మంచి స్నేహ బంధం ఉంది. మ్యూజిక్ విషయంలో పాట పడినా గాని బయట వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. అంతమాత్రమే కాదు ఇటీవల ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన ఎవరు మీలో కోటీశ్వరుడు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని గేమ్ ఆడారు. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ లుగా వ్యవహరిస్తున్న వీరిద్దరూ ఒకరి ఫై మరొకరు పొగడ్తల వర్షం కురిపించడంతో.. నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.