Thaman: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులు కలిగిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman). గత ఏడాది “అలా వైకుంఠపురంలో”(Ala Vaikuntapuramlo) సినిమా సాంగ్స్ తో… బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందుకున్న తమన్.. అప్పటినుండి వరుస పెట్టి కీలక ప్రాజెక్టులు క్యాష్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో తెరకెక్కిన టాప్ మోస్ట్ సినిమాల్లో రిలీజ్ అయిన అఖండ(Akhanda) సూపర్ డూపర్ హిట్ కావడానికి ప్రధాన కారణం మ్యూజిక్. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. బోయపాటి టేకింగ్ కి సరిగ్గా సెట్ అవ్వటంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
ఇదే తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న “భీమ్లా నాయక్” కి కూడా తమన్ అందించిన మ్యూజిక్ పాటలు ఇప్పుడు బయట మార్కెట్ లో మోత మోగుతున్నాయి. ఇదిలా ఉంటే తమన్ చాలా వరకు.. సౌత్ ఇండియా సినిమాలు చేయడం జరిగింది బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినా పెద్దగా చేయలేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ చేయకపోవడానికి గల కారణం ఏంటో తాజాగా తమన్ బయటపెట్టాడు. విషయంలోకి వెళితే బాలీవుడ్ ఇండస్ట్రీ లో సినిమా చేయాలనే అవకాశం వచ్చినా చేయను. అక్కడ ఒక సినిమాకు ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేస్తారు.
పాటల కి ఒక మ్యూజిక్ డైరెక్టర్ అదేవిధంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్.. బాలీవుడ్ సినిమాలకు మ్యూజిక్ అందించే పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. అటువంటి ప్రక్రియ నాకు అస్సలు నచ్చదు. సినిమా మొత్తానికి ఒకే మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి అది సౌత్ లో… సాగుతూ ఉంది అందుకే నేను మన సినిమాలు చేస్తాను. ప్రస్తుతం సమంత చేతిలో పవన్ కళ్యాణ్ “బిమ్ల నాయక్”, మహేష్ “సర్కార్ వారి పాట”, త్రివిక్రమ్ మహేష్ సినిమా.. శంకర్ చరణ్ సినిమా.. అదే విధంగా రవితేజ రామారావు ఆన్ డ్యూటీ వంటి ప్రాజెక్టులకి తమన్ సంగీతం అందిస్తున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!