Radhe shyam: థమన్ దిగాడు..ఇండస్ట్రీ హిట్ అని బ్లైండ్‌గా ఫిక్సవ్వండి..

Share

Radhe shyam: ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్. ఆయన సంగీతం అందించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధిస్తున్నాయి. ఇప్పుడు మీడియం బడ్జెట్ సినిమా అయినా, పాన్ ఇండియన్ సినిమా అయినా థమన్ వన్ అండ్ ఓన్లీ ఛాయిస్‌గా మారాడు. మేకర్స్ ఎంత నమ్మకంతో ప్రాజెక్ట్ అప్పగిస్తే అంతకు రెట్టింపు నమ్మకంతో సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేందుకు ప్రధాన కారణం అవుతున్నాడు. గత ఏడాది వచ్చిన అల వైకుంఠపురములో సినిమా నుంచి థమన్ దూకుడు ఓ రేంజ్‌లో సాగుతోంది.

thaman is fixed for radheshyam bgm
thaman is fixed for radheshyam bgm

మెగా హీరోల సినిమాలతో పాటు టాలీవుడ్‌లో దాదాపు అందరు హీరోల సినిమాలకు థమన్ సంగీతం అందించే అవకాశం అందుకుంటున్నాడు. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఊక దంపుడు అని కామెంట్స్ చేసిన వారే ఇప్పుడు థమన్ చేతికి భారీ ప్రాజెక్ట్స్ అప్పగిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సహా రవితేజ, బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ ఇలా దాదాపు అందరు హీరోల సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. అయితే ఎప్పుడో ప్రభాస్ హీరోగా రెబల్ సినిమాకు సంగీతం అందించే అవకాశం వచ్చినట్టే వచ్చి మిస్ అయింది.

Radhe shyam: థమన్ చేతికి రాధే శ్యామ్ సినిమాకు నేపథ్య సంగీతం అందించే అవకాశం..

అప్పటి నుంచి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాడు థమన్. ఆ అవకాశం ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమా రాధే శ్యామ్ సినిమాకు దక్కింది. ఇప్పటికే ఈ సినిమాకు పలువురు సంగీత దర్శకులు సాంగ్స్ అందిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించే అవకాశాలు అందుకున్నాడు. అఫీషియల్‌గా ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు. ఇటీవల వచ్చిన అఖండ సినిమా సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థమన్ క్రేజ్ మరింతగా పెంచింది. ఇప్పుడు ఇదే థమన్ చేతికి రాధే శ్యామ్ సినిమాకు నేపథ్య సంగీతం అందించే అవకాశం వచ్చేలా చేసింది. థమన్ చేరడంతో ప్రాజెక్ట్‌పై అంచనాలు మరో రేంజ్‌లో పెరిగాయి. ఈ సినిమాకు రాధకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది.


Share

Related posts

Empty Stomach: ఖాళీ కడుపుతో ఈ పనులు చేస్తున్నారా..!! అయితే ప్రమాదమే..!!

bharani jella

చాటింగ్ తో మోసపోకండి!!!

Kumar

పండగలు వస్తున్నాయి..! బంగారం ధర పెరుగుతుందా..!!

S PATTABHI RAMBABU