Thaman: ఇపుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కడ విన్నా SS థమన్ గురించే వినబడుతోంది. అవును… గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ థమన్ హవా నడుస్తోంది. ఒకప్పుడు దేవి శ్రీ వున్న స్థానానికి ఇపుడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చేరుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్టార్ హీరోలకు ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ గా మారిపోయాడు. దేవి శ్రీ ప్రసాద్ కన్నా కూడా ఎక్కువ సినిమాలను థమన్ చేస్తూ ఇండస్ట్రీలో దూసుకు పోతున్నాడు. ఇక తాజాగా ‘సర్కారు వారి పాట’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి దుమ్ములేపాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Thaman: థమన్ వైఫ్?
ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్న థమన్ ఎన్నో ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఉంటాడు. ఈ సందర్భంగా తన సినిమాల గురించి అనేక విషయాలు చెప్పే థమన్ తన భార్య పిల్లల గురించి మాత్రం ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు మనకు కనిపించవు. ఇంకా చాలా మంది థమన్ కు పెళ్లి కాలేదనే అభిప్రాయంలో ఉన్నారు. అయితే థమన్ కు చాలా కాలం క్రితమే పెళ్లి అయ్యింది. ప్లే బ్యాక్ సింగర్ వర్ధినిని థమన్ పెళ్లి చేసుకున్నాడన్న విషయం అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. గతంలో వర్ధిని పలువురు సంగీత దర్శకుల వద్ద ప్లే బ్యాక్ సింగర్ గా పాడింది. అయితే సదరు సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వక పోవడంతో వర్ధిని గురించి జనాల్లో అవగాహణ లేదు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
భార్య గురించి థమన్:
అయితే థమన్ తాజాగా సర్కారు వారి పాట సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భార్య వర్ధిని గురించి మాట్లాడాడు. తన భార్య వర్ధిని వాయిస్ బాగుంటుందని కితాబిచ్చాడు. ఆమె వాయిస్ డైరెక్టర్స్ మరియు నిర్మాతలకు నచ్చి.. వర్ధినితో పాడిస్తే బాగుంటుందని భావిస్తే తప్పకుండా ఆమెతో పాడించడానికి నాకేమి అభ్యంతరం లేదు అని అన్నాడు. ఇంకా మాట్లాడుతూ… వర్ధినితో స్టేజ్ షోలు చేయాలి అనేది నా డ్రీమ్ అంటూ థమన్ పేర్కొన్నాడు. ఆమె పాడిన పాటలు హిట్ అయిన తర్వాత మేము ఇద్దరం కలిసి స్టేజ్ షో లు చేస్తామంటూ థమన్ పేర్కొన్నాడు.