Thaman: గత ఏడాది “అలా వైకుంఠపురం లో” సినిమా సాంగ్స్ తో సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ప్రస్తుతం వరుస పెట్టి అవకాశాలు అందుకుంటున్నారు. ఈ ఏడాది రిలీజ్ అయిన వకీల్ సాబ్, తర్వాత పవన్ – రానా మల్టీస్టారర్ సినిమా… మహేష్ “సర్కారు వారి పాట” సినిమా.. బాలయ్య బాబు బోయపాటి తెరకెక్కిస్తున్న “అఖండ” సినిమా వంటి చాలా ప్రతిష్ఠాత్మకమైన సినిమాలకు తమన్ యే మ్యూజిక్ అందిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో తమన్ హవా కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో మరో అదిరిపోయే అవకాశాన్ని తమన్ తాజాగా అందుకున్నట్లు సమాచారం.
పూర్తి విషయంలోకి వెళ్తే మలయాళం సినిమాల్లో “లూసిఫర్” నీ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మోహన్ రాజా ప్రస్తుతం తెలుగు నేటివిటీకి సంబంధించి స్క్రిప్టు మొత్తం చేంజ్ చేస్తున్నట్లు దానిపై వర్క్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ నీ ఫైనలైజ్ చేసినట్లు, ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రెండు పాటలు కూడా తమన్ కంప్లీట్ చేయడం జరిగిందట.
Read More: Thaman: మరో అదిరిపోయే ఆఫర్ అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్..??
ఈ సినిమాకి “కింగ్ మేకర్” అనే టైటిల్ పెట్టాలని సినిమా యూనిట్ ఆలోచన చేస్తుంది. రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టాలని చిరంజీవి… డిసైడ్ అయ్యారట. “ఆచార్య” సినిమాకి సంబంధించి షూటింగ్ దాదాపు కంప్లీట్ అవటంతో చిరంజీవి మెల్లమెల్లగా మిగతా ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నారట. దీంతో లూసీఫర్ సినిమా కి సంబంధించి సంగీతానికి తమన్ కి ఫస్ట్ టైమ్ చిరంజీవి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.