Subscribe for notification
Categories: సినిమా

Thank You: థ్యాంక్యూ టీజ‌ర్‌.. ఎన్నో వ‌దులుకున్నా, ఇక నో కాంప్రమైజ్ అంటున్న చైతు!

Share

Thank You: `లవ్ స్టోరీ`, `బంగార్రాజు` చిత్రాల‌తో వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుని ఫుల్ జ్యోష్‌లో ఉన్న యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌.. ఇప్పుడు `థ్యాంక్యూ`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు. విక్రమ్ కె. కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రాశీ ఖన్నా, మాళవిక నాయర్‌, అవిక గోర్ హీరోయిన్లుగా న‌టించారు.

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కొద్ది నెల‌ల క్రిత‌మే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 8వ తేదీన గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను షురూ చేసిన మేక‌ర్స్‌.. తాజాగా థ్యాంక్యూ టీజ‌ర్‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు.

`నా సక్సెస్ కు నేనే కారణం` అని చైతూ కోపంగా ఇంగ్లీష్ లో చెప్పే డైలాగ్‌తో ప్రారంభ‌మైన టీజ‌ర్‌.. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. మాళవిక, అవిక గోర్, రాశీ ఖ‌న్నాల‌తో చైతు సాగించిన ప్రేమాయ‌ణాలు ఇందులో చూపించారు. మూడు స్టేజ్ లలో చైతు లుక్స్ లో వెరీయేషన్స్ ఆక‌ట్టుకున్నాయి. `లైఫ్ లో ఇంక కాంప్రమైజ్ అయ్యేదే లేదు.. ఎన్నో వదులుకొని ఇక్కడికి వచ్చాను` అంటూ చైతు చెప్పై డైలాగ్ బాగా అల‌రించింది.

ఓ వ్యక్తి తన జీవితంలో తప్పులను సరిదిద్దుకుని త‌నని తాను అన్వేషించుకుంటూ సాగించే ప్రయాణమే థ్యాంక్యూ అని అర్థం అవుతోంది. టీజ‌ర్‌లో రొమాన్స్‌, యాక్ష‌న్‌, ఎమోష‌న్స్ అన్నిటికీ స‌మాన ప్రాధ్యాన్య‌త ఇచ్చారు. మొత్తానికి అదిరిపోయిన ఈ టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను పెంచేసింది. మ‌రి ఆ అంచ‌నాల‌ను చైతు అందుకుంటాడో.. లేదో.. చూడాలి.


Share
kavya N

Recent Posts

CM YS Jagan: ప్రధాని మోడీకి ప్రధాన అంశాలపై సీఎం వైఎస్ జగన్ వినతి.. ఈ సారి అయినా మోడీ మోక్షం లభిస్తుందా..?

CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…

2 hours ago

Somu Veerraju: మోడీ పర్యటన సందర్భంగా దుష్టశక్తుల భారీ కుట్ర అంటూ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…

3 hours ago

Peanut Rice: ఎదిగే పిల్లలకు పీనట్ రైస్ చేసి పెట్టండి.. బలానికి బలం రుచికి రుచి..!

Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…

4 hours ago

AP Minister RK Roja: మంత్రి రోజా సెల్ఫీ ఫోటోకు నవ్వుతూ ఫోజు ఇచ్చిన ప్రధాని మోడీ

AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…

4 hours ago

Race Gurram: మరోసారి రేసుగుర్రం కాంబినేషన్ రిపీట్..??

Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…

6 hours ago

SSMB28: కన్నడ స్టార్ హీరోతో కలసి మహేష్ బాబు..??

SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…

6 hours ago