సినిమా

ఆ కమెడియన్ లక్ మామూలుగా లేదు.. ఒకేసారి డబుల్ జాక్‌పాట్!

Share

 

ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఒక్కోసారి కెరీర్ స్లో అవుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఒక బ్లాక్ బస్టర్ హిట్టు వస్తే మళ్లీ వెండి తెరను ఏలేస్తారు. కానీ కొంతమందికి మాత్రం ఎన్ని హిట్లు వచ్చినా ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావు. ఎందుకంటే ఇండస్ట్రీ పోకడ చిత్ర విచిత్రంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న నటులలో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఒకరు. రెగ్యులర్‌గా సినిమాల్లో నటిస్తున్న కూడా ఒకప్పుడున్న గుర్తింపును కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కోల్పోయాడనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఒక నెలలోనే రెండు సినిమాల్లో కథ మలుపు తిప్పే పాత్రలలో నటించి మళ్లీ గతంలోలాగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

బింబిసార సినిమాలో కీ-రోల్

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా గతవారం రిలీజ్ అయింది. ఈ సినిమాలో స్టైలిష్ మీసాలతో ఉన్న ‘జుబేదా’ పాత్ర శ్రీనివాస్ రెడ్డికి మంచి పేరు తెచ్చి పెట్టింది. జుబేదా పాత్ర సినిమా మొత్తం కనిపించకపోయిననా చక్రవర్తి ఫ్లాష్ బ్యాక్ తో పాటు క్లైమాక్స్‌లో సినిమాని మలుపుతిప్పే పాత్రగా హైలెట్ అయ్యింది. అందుకే ప్రమోషన్స్‌లో కళ్యాణ్ రామ్‌తో పాటు శ్రీనివాస్ రెడ్డి కూడా చాలా యాక్టివ్ గా పాల్గొన్నాడు.

కార్తికేయ-2లోనూ ప్రాధాన్యమున్న రోల్

నిన్న రిలీజ్ అయిన కార్తికేయ 2 సినిమాలో నిఖిల్ సిద్ధార్థ మామయ్య పాత్రలో శ్రీనివాస్ రెడ్డి అదరగొట్టాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేలా ఉంది. అలాంటి సినిమాలో మంచి పాత్ర దొరకడంతో శ్రీనివాస్ రెడ్డికి గొప్ప గుర్తింపు రావడం ఖాయమైంది. శ్రీనివాస్ రెడ్డి క్యారెక్టర్ కార్తికేయ 2 సినిమాలో అరగంట తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత కృష్ణుడి భక్తుడుగా సినిమా చివరి వరకు హీరోతో కలిసి కనిపిస్తాడు. ఎప్పుడో 2001లో ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీనివాస్ రెడ్డి స్పీడ్ ఈమధ్య బాగా తగ్గింది. ఈ సంవత్సరం అతను నటించిన సినిమాల్లో భళా తందనాన, టెన్త్ క్లాస్ డైరీస్ ఫ్లాప్ అయ్యాయి. ఎఫ్ 3 మాత్రం హిట్ అయింది కానీ అందులో ఆర్టిస్టులు చాలామంది ఉండటంతో శ్రీనివాస్ రెడ్డి పాత్ర హైలెట్ అవ్వలేదు. కానీ ఈ నెలలో రిలీజ్ అయిన రెండు సినిమాలు అతనికి సంతోషించదగ్గ గుర్తింపును తెచ్చిపెట్టాయి.

 


Share

Related posts

Trivikram Mahesh: త్రివిక్రమ్ కి డెడ్ లైన్ పెట్టిన మహేష్ బాబు..??

sekhar

Chiranjeevi: కాజ‌ల్ ఉండుంటే ఈ ప‌రిస్థితి వ‌చ్చేదా చిరు.. నెటిజ‌న్లు సెటైర్లు!

kavya N

Mugguru Monagallu: ముగ్గురు మొనగాళ్ళు రిలీజ్ డేట్ ఫిక్స్..!!

bharani jella