Rajamouli: RRR సినిమా విడుదల తరువాత అలియా భట్ అలిగిందనే రూమర్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ఇక సినిమా చూసిన వాళ్ళు అలియా అలగడంలో తప్పేమి లేదని అన్నారు. ఎందుకంటే సినిమాలో అలియాకి యాక్టింగ్ స్కోప్ అంతంత మాత్రమే మరి. ఈ క్రమంలో SS రాజమౌళిని, అలియాని ఈ విషయంలో అనేక మీడియాలు ప్రశ్నిస్తూ వచ్చాయి. దానికి వారు రకరకాలుగా సమాధానాలు చెప్పేవారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి తాను ఆలియాతో మళ్లీ పని చేయాలనుకుంటున్నారా లేదా అనేది వెల్లడించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Rajamouli: రాజమౌళి సమాధానం ఇదే:
రాజమౌళి తాజాగా ఆ పుకార్లపై ఓపెనయ్యారు. అతను మళ్లీ అలియాతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మీ సినిమా గురించి ఎటువంటి రూమర్స్ రాకపోతే మీరు నిజంగా మీ సినిమా ద్వారా ఎలాంటి ప్రభావం చూపలేదని అర్ధం. నేను నిజంగా అలియాను ఇష్టపడతాను. ఆమె నటనా నైపుణ్యానికి నేను ఎప్పుడో ఫిదా అయిపోయాను. నేను తనతో మళ్లీ పనిచేయడానికి నిజంగా ఎదురుచూస్తున్నాను. ఆమె నా గురించి అదే చెబుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నటిగా దర్శకుడిగా మేం ఇద్దరం నిజంగా క్లిక్ అయ్యాం.” అని చెప్పుకొచ్చారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అలియా సమాధానం ఇదే:
ఈ విషయాలను విన్న అలియా మిశ్రమంగా స్పందించింది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ గురించి పొగుడుతూనే, సినిమాలో తనకు పెద్ద పాత్ర దక్కకపోవడం పట్ల విచారం వ్యక్తం చేసింది. రెండు శక్తులు(చరణ్ – తారక్)ను ఒకచోట చేర్చడంలో తనది చాలా ముఖ్యమైన పాత్ర అని జక్కన్న చెప్పారని, అది చెప్పిన వెంటనే నేను ఒప్పుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది. మేము కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. కానీ పాత్ర నిడివి మాత్రం ఒకింత బాధను కలిగించింది అని టాపిక్ ఎండ్ చేసింది. దాంతో ఈ విషయంలో అలియా అలగడం నిజమేనంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.