సినిమా

Samantha: ఆ నొప్పి సమంతని చాలా తీవ్రంగా బాధిస్తోందట!

Share

Samantha: సమంత ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ క్షణం కూడా తీరిక లేనంత బిజీగా గడుపుతోంది. అయితే తాజాగా స్మాల్ బ్రేక్ అంటూ థాయ్ లాండ్ లో సడెన్ గా ప్రత్యక్షమైంది. సౌత్ సినిమాలతో పాటు హిందీలో కూడా జోరుగా ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తున్న సమంత ఫుల్ బిజీగా వుంది. తాజాగా తెలుగులో శివ నిర్వాణ దర్శకత్వంలో, విజయ్ దేవరకొండ హీరోగా తన తదుపరి చిత్రానికి సంతకం చేసింది. ఈ చిత్రం ఈరోజు లాంచ్ అయింది. ఈ వేడుకకు సామ్ హాజరు కాలేదు. ఇంతకీ సమంత ఏమైంది? అని ఆరా తీస్తే.. థాయ్ లాండ్ లో హాలిడేస్ ని సెలబ్రేట్ చేస్తూ బిజీగా ఉందని టాక్.

That pain is hurting Samantha so much!
That pain is hurting Samantha so much!

Samantha: ఆ నొప్పి ఏమిటబ్బా?

ఇన్ స్టాగ్రామ్ లో తన వెకేషన్ ఫోటోలను షేర్ చేసిన సామ్ మంచి హాట్ గా కనిపిస్తోంది. ఇక కశ్మీర్ నేపథ్యంలోని సినిమాకి ప్రిపేరయ్యే ముందు ఇలా రిలాక్స్ కోసం విదేశీ వెకేషన్ ప్లాన్ చేసిందని అంతా అనుకుంటున్నారు. ఇక మజిలీ తర్వాత ఆమె శివ నిర్వాణతో కలిసి పనిచేయడం ఇది రెండవసారి. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కేవలం 4 నెలల్లో పూర్తి చేయనున్నారని సమాచారం. ఇకపోతే తాజాగా సమంత ఓ టాప్ సీక్రెట్ ని రివీల్ చేసింది. ఒక నొప్పి దాదాపు 6 నెలల నుండి ఆమెని బాధిస్తోందట.

That pain is hurting Samantha so much!
That pain is hurting Samantha so much!

అది ఇదే..

ఇంతకీ ఆ నొప్పి ఏమిటని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా… ప్రస్తుతం ఆమె చెవికి దాదాపు 5 కుట్లు ఉన్నాయి. సినిమా స్టైలింగ్ లో భాగంగా సమంత చెవిపోగులు కుట్టించుకుందట. అయితే చెవి మధ్య భాగంలోను కూడా ఒక పోగు కుట్టించుకుంది. కానీ ఇది తీవ్రంగా తనని బాధించేస్తోందట. ఆ నొప్పి తగ్గడానికి 6 నెలల టైమ్ పెట్టినట్లు సమంత వాపోయింది. ఇకపోతే సామ్ సినిమాల విషయానికొస్తే, శాకుంతలం విడుదల కావాల్సి ఉంది. విజయ్ సేతుపతితో ‘కాతు వాకుల రెండు కాదల్’ ఈ నెలలో విడుదలవుతోంది.


Share

Related posts

రెండేళ్ల క్యాలెండర్ ని ఫిల్ చేసిన రెబల్ స్టార్

Kranthi Aman

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సండే స్పెషల్ స్టోరీ..!! వచ్చేవారం జరిగేది ఇదేనా..!?

bharani jella

Thaman : థమన్ కి బాలీవుడ్ ఆఫర్స్..నో అన్న మ్యూజిక్ సెన్షేషన్

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar