33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Unstoppable 2: త్రివిక్రమ్ తో ఆ గొడవ ఇప్పటికీ కూడా పరిష్కారం కాలేదు.. పవన్ సంచలన వ్యాఖ్యలు..!!

Share

Unstoppable 2: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ప్రారంభంలో చాలామంది స్నేహితులు ఉండేవారు. వారిలో  అతి తక్కువ మంది ఆయనకీ దగ్గరగా ఉండే వ్యక్తులు ఉంటారు. వారిలో ఒకరు డైరెక్టర్ త్రివిక్రమ్. చాలా సినిమా వేడుకలలో ఇంకా పలు రాజకీయ మీటింగ్లలో త్రివిక్రమ్ గురించి పవన్ అనేక విషయాలు పంచుకోవడం జరిగింది. జీవితంలో మానసికంగా ఇంకా అనేక రకాలుగా కృంగిపోయిన సమయంలో.. త్రివిక్రమ్ తన భుజం కాశాడని “అజ్ఞాతవాసి” ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ చెప్పడం జరిగింది.

That quarrel with Trivikram is still not resolved Pawan's sensational comments

ఇదిలా ఉంటే ఆహా “అన్ స్టాపబుల్” షోలో పవన్ డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఫస్ట్ టైం తన ఫామ్ హౌస్ లో ఉన్న సమయంలో.. స్క్రిప్ట్ చెప్పడానికి రావడం జరిగింది ఆయన చెబుతున్నారు నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత “అతడు” స్టోరీ వినిపించడం జరిగింది. అయితే ఆ సమయంలో తాను నిద్రపోవడం జరిగిందట. ఈ సందర్భం గురించి నాకు ప్రారంభం నుండి త్రివిక్రంతో గొడవ అవుతూనే ఉండేది. నేను నిద్రపోలేదు స్క్రిప్ట్ మొత్తం విన్నాను అని అనేవాడిని. లేదు నువ్వు నిద్ర పోయావు అనీ త్రివిక్రమ్ నాతో గొడవ. ప్రతిసారి ఈ సందర్భం గురించి మా ఇద్దరి మధ్య గొడవ అవుతుంది ఇప్పటికీ కూడా తేలలేదు.. అని “అన్ స్టాపబుల్” షోలో పవన్ తెలియజేశారు.

That quarrel with Trivikram is still not resolved Pawan's sensational comments

అంతేకాదు త్రివిక్రమ్ తనకు స్నేహితుడు కంటే… గురువు మాదిరిగా భావిస్తానని చెప్పుకొచ్చారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలకు బాలయ్య అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చారు. ఒక రచయితని నువ్వు గురువుగా భావించావంటే నీ మీద నాకు ఉన్న గౌరవం మరింత పెరిగింది అని కొనియాడారు. ఇక ఇదే సందర్భంలో ఇద్దరం కలిసినా సమయంలో చాలా వరకు పుస్తకాల గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది. ఇంకా తాను “ఖుషి” తర్వాత రెండు మూడు సినిమాలు చేసి.. ఇంకా ఆపేద్దామని డిసైడ్ అయినట్లు పవన్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పూర్తిగా వ్యవసాయం చేయాలని డిసైడ్ అయ్యాను. దాని తర్వాత అలా అలా సినిమాలు చేసుకుంటూ వచ్చాను.


Share

Related posts

కష్టాల్లో హీరోయిన్ రాశి.. ఆమె రోడ్డున పడటానికి కారణం ఏంటీ?

Ram

చైతు కంటే సమంత సంపాదన అంత ఎక్కవనా.. అందుకే వదిలేసిందా?

Ram

KGF2: కేజిఎఫ్ 2 కొత్త రిలీజ్ డేట్..!!

P Sekhar