సినిమా

Samantha: అర్థరాత్రి సామ్‌కు ఆ హీరో బ‌ర్త్‌డే విషెస్‌.. ఇంత అభిమాన‌మేంటో?!

Share

Samantha: ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. 2010లో విడుద‌లైన సూప‌ర్ హిట్ చిత్రం `ఏ మాయ చేశావే`తో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అందాల భామ‌.. అన‌తి కాలంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. తన నటన, గ్లామర్, ఫిట్‌నెస్‌తో ఎల్ల‌ప్పుడూ అభిమానుల‌ను, ప్రేక్ష‌కుల‌ను అల‌రించే సామ్‌.. త‌న మొద‌టి సినిమా హీరో అయిన నాగ‌చైత‌న్య‌ను ప్రేమించి పెద్ద‌ల స‌మ‌క్షంలో వివాహం చేసుకుంది.

కానీ, వీరి పెళ్లి మూడ్నాళ్ల ముచ్చ‌టే అయింది. నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే స‌మంత నాగ‌చైత‌న్య నుంచి విడిపోయింది. ప్ర‌స్తుతం కెరీర్‌పైనే ఫోక‌స్ పెట్టిన స‌మంత‌.. నేడు త‌న 35వ పుట్టిన‌రోజును జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఆమెకు అభిమానులు మ‌రియు సినీ ప్రిముఖులు సోష‌ల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు.

అయితే వీరింద‌రిలో ఒక్క‌రి పోస్ట్ మాత్రం తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ ఆ ఒక్క‌రూ ఎవ‌రో కాదు.. మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌. ఈయ‌న స‌రిగ్గా అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు సామ్ ఫొటో షేర్ చేసి `జెస్సీ, నువ్వు ఏం మాయ చేశావో కానీ.. ఎటో వెళ్లిపోయింది మనసు. హ్యాపీ బర్త్ డే సామ్. ఇట్లు నీ వీరాభిమాని..` అని ట్వీట్ చేశారు.

దీంతో సాయి ధ‌ర‌మ్ తేజ్‌ ట్వీట్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కొంద‌రైతే సామ్‌పై సాయి తేజ్‌కు ఇంత అభిమాన‌మేంటో అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. కాగా, సాయి ధ‌ర‌మ్ తేజ్ సినిమాల విష‌యానికి.. ఈయ‌న చివ‌రిగా `రిప‌బ్లిక్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఆ త‌ర్వాత బైక్ ప్ర‌మాదానికి గురి కావ‌డం వ‌ల్ల మ‌రే సినిమా చేయ‌లేదు.


Share

Related posts

Anushka: చెఫ్‌గా మారుతున్న అనుష్క‌.. అస‌లు క‌థేంటంటే?

kavya N

అతన్ని చెప్పుతో కొట్టాలనుందట…

Siva Prasad

ఆ స్కూల్‌కి , మెగా ఫ్యామిలీకి సంబంధం లేదు

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar