డ్రగ్స్ కొంటూ.. ‘రెడ్ హ్యాండెడ్’గా దొరికిన నటి?

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరపైకి వచ్చింది. గత కొద్ది నెలల నుంచి ముంబై ప్రాంతాన్ని డ్రగ్ మాఫియా పట్టిపీడిస్తోంది. డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ప్రముఖ బాలీవుడ్ నటుల పేర్లు తెరపైకి వచ్చాయి. అంతే కాకుండా ఈ డ్రగ్ కేసును దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) పలువురు ప్రముఖ నటీనటులను గంటలతరబడి విచారణ చేపట్టింది. అయితే డ్రగ్ వ్యవహారం ఇంతటితో ఆగిపోకుండా, తాజాగా డ్రగ్స్ కొంటూ రెడ్ హ్యాండెడ్ గా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ)కి టీవీ నటి ప్రీతిగా చౌహన్ దొరికారు.

 

బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం డ్రగ్ మాఫియాతో సంబంధమున్నట్లు ఈ కేసును ఎన్‌సీబీ అప్పగించారు. ఈ కేసు విచారణలో భాగంగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్, సారా అలియా బట్ట మొదలైన వారిని ఈ కేసులో భాగంగా దర్యాప్తు హాజరు కావాలని సూచించారు. గంటల తరబడి వీరిపై విచారణ చేపట్టిన ఎన్‌సీబీ కీలక విషయాలను తెలుసుకున్నారు.

ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులు గడవక ముందే, విచారణ పూర్తవకుండానే బుల్లితెర నటి ప్రీతి చౌహాన్ డ్రగ్స్ కొంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ప్రీతి చౌహన్ ‘సంవాదన్ ఇండియా,దేవో కె దేవ్ మహదేవ్ వంటి సీరియళ్లలో కీలక పాత్ర పోషించి మంచి పేరును సంపాదించుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్ లో భాగంగా ఎన్‌సీబీ అధికారులు సివిల్ డ్రెస్ లో వెర్సోవా, ముంబైలలో పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటికీ ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సుశాంత్ ఆత్మహత్య తర్వాత వెలుగులోకి వచ్చిన వ్యవహారం ప్రతి చిన్న విషయాన్ని ఎన్‌సీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.