Karate Kalyani: నటి కరాటే కళ్యాణి అందరికీ సుపరిచితురాలే. ఎన్నో సినిమాలలో కామెడీ పాత్రలలో నటించడం జరిగింది. మిరపకాయ సినిమాలో లెక్చరర్ పాత్రలో.. ఆమె చేసిన నటన చాలా హైలెట్. అదేవిధంగా కృష్ణ సినిమాలో బ్రహ్మానందం తో కూడా కామెడీ సన్నివేశాలలో కరాటే కళ్యాణి.. అద్భుతంగా నటించింది. ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో రాణించింది. ఆ సీజన్ లో ప్రారంభంలోనే… ఎలిమినేట్ అయిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా కరాటే కళ్యాణినీ “మా” అసోసియేషన్ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ “మా” అసోసియేషన్ ఈనెల 16వ తేదీన షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
అయితే ఆ నోటీసులపై ఇప్పటివరకు కళ్యాణి స్పందించకపోవడంతో…”మా” అసోసియేషన్ నుంచి కరాటే కళ్యాణినీ సస్పెండ్ చేసినట్లు “మా” సభ్యులు తెలియజేశారు. ఈనెల 16వ తారీఖున పంపిన షోకాజ్ నోటీసులకు నిర్ణీత సమయంలో వివరణ ఫైల్ చేయడంలో విఫలం కావడంతో… ఆ తర్వాత లీగల్ నోటీసులు జారీ చేయగా వాటికి కూడా.. సమాధానం చెప్పకపోవడం..”మా” సభ్యుల కోసం నిర్దేశించిన ప్రవర్తన నియమావాలిని ఉల్లంఘించటమే అవుతుంది. దీనిపై “మా” అసోసియేషన్ నేడు చర్చించి తక్షణమే సస్పెండ్ చేయడం జరిగింది అంటూ నోటీసులో కరాటే కళ్యాణికి వివరణ ఇచ్చారు “మా” అసోసియేషన్ సభ్యులు. మరి దీనిపై కరాటే కళ్యాణి ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఖమ్మంలో 54 అడుగుల విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆ విగ్రహం కృష్ణుడు రూపంలో కూలి ఉందని కరాటే కళ్యాణి కోర్టుకు వెళ్లడం జరిగింది. దీంతో తదుపరి తీర్పు ఇచ్చేవరకు విగ్రహావిష్కరణ ఆపాలని కోర్టు స్టే విధించింది. అయితే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న ఎన్నారైలు విగ్రహంలో స్వల్ప మార్పులు చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. మే 28వ తారీకు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ హైకోర్టు ఈ కార్యక్రమానికి బ్రేక్ వేయడం జరిగింది. తదుపరి విచారణ జూన్ 6కి వాయిదా వేయడం జరిగింది.