సినిమా

రొటీన్ రొట్ట సినిమాలు తీసిన హీరోలకు ప్రేక్షకులు సరైన గుణపాఠం..!

Share

 

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని ఏళ్లుగా సినిమాలు అన్ని రొటీన్ స్టోరీతో వస్తున్నాయని చెప్పవచ్చు. దాదాపు అన్ని సినిమాల్లో ఒకటే స్టోరీ ఉండటం బాగా రొటీన్ అయిపోయింది. ఆ స్టోరీ ఏంటంటే.. ఏదైనా ఒక ఊరిలో లేదా సిటీలో పెద్ద రౌడీ ఉంటాడు. అతని చూసి ఆ టౌన్ ప్రజలు అందరూ భయపడుతుంటారు. అతను ఏం చెప్తే అదే వాళ్లకు వేదంగా భావిస్తారు. అలాంటి టైమ్‌లో హీరో ఒక పోలీసుగానో, డాక్టర్ గానో లేదా ఒక సాధారణమైన వ్యక్తిగానో ఆ ఊరిలోకి అడుగు పెడతాడు. ఏదో ఒక విషయంలో విలన్‌కి ఎదురు వెళ్తాడు. ఆ తర్వాత ఫైటింగ్స్ స్టార్ట్ అవుతాయి.ఆ ఫైటింగ్స్ లో హీరోని చూసి హీరోయిన్ ప్రేమలో పడుతుంది. సినిమా చివరిలో హీరోదే పైచేయి అవుతుంది. క్యారెక్టర్లు వేరైనా ఇలాంటి కథ మనం చూస్తూనే ఉన్నాం.

 రెండు సినిమాల్లోనూ రొటీన్ కాదే

గత నెలలో విడుదలైన ది వారియర్ సినిమా దాదాపు అలానే ఉంది. కాకపోతే ఆ సినిమాలో హీరోను డైరెక్ట్ గా పోలీస్ గా చూపించకుండా ఫస్ట్ డాక్టర్ గా చూపించి ఆ తర్వాత పోలీస్ పాత్రలో చూపిస్తారు. ఇక తాజాగా రిలీజ్ అయిన మాచర్ల నియోజకవర్గం కథ కూడా అంతే ఉంది. ఈ సినిమాలో హీరో నితిన్ కలెక్టర్ పాత్రలో కనిపిస్తాడు. కానీ అతను చేసేదంతా మాస్ హీరోయిజమే. హీరో కలెక్టర్ కావడం వల్ల ఆ పాత్రకు చేకూరిన ప్రత్యేకమైన ప్రయోజనం ఏమీ లేదు. దివారియర్, మాచర్ల నియోజకవర్గం సినిమాల్లో కొత్తధనం ఏమాత్రం లేదు. మాచర్ల నియోజకవర్గం ఎప్పుడో పాతకాలంనాటి సినిమా లాగా అనిపిస్తుంది.

ఇప్పటికైనా మారాల్సిన అవసరం ఉంది

చాలా సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన ఎమ్ ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా చూశాక అయన ఎడిటర్‌గా ఉంటూ అసలు ఏం నేర్చుకున్నాడు? అని ఎవరికి వారు కచ్చితంగా ప్రశ్నించుకుంటున్నారు. మరీ పచ్చిగా చెప్పాలంటే.. అతను ఎడిటింగ్ చేసిన కొన్ని సినిమాల్లో అతనికి నచ్చిన కొన్ని సీన్స్ ని ఈ సినిమాలో అచ్చు గుద్దినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాలో అసలు క్రియేటివిటీనే వాడలేదు. ప్రస్తుతం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చూస్తున్న ఆడియన్స్, ఇలాంటి రిపీటెడ్ పాత ఫార్ములా ఉన్న సినిమాలను ప్రేక్షకులు నిర్మోహమాటంగా రిజెక్ట్ చేస్తున్నారు. అందుకే డైరెక్టర్లు నేటి ఆడియన్స్ ఆలోచనలకు తగ్గట్టు కొంచెం క్రియేటివ్ గా ఆలోచించి సినిమాలు తీస్తే బాగుంటుంది.


Share

Related posts

తండ్రితో క‌లిసి చిరు న‌టించిన సినిమా ఏదో తెలుసా?

Teja

టిప్ టాప్‌గా.. స్టైలిష్ ప‌వ‌న్‌

Siva Prasad

Krithi Shetty And Vaishnav Tej Kalamandir Kalyan Shopp Opening Photos

Gallery Desk