Ram Charan: మెగా కుటుంబంలో జూన్ 20వ తారీకు చరణ్ మరియు ఉపాసన జంటకు మెగా ప్రిన్సెస్ కూతురు పుట్టడం తెలిసిందే. పెళ్లయిన 11 సంవత్సరాల తర్వాత బిడ్డ జన్మించడంతో మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. చిరంజీవి ఎంతగానో సంతోషించారు. తన మనవరాలు గర్భంలో ఉన్నప్పుడే తన కుటుంబంలో ఎన్నో శుభకార్యాలు జరిగాయని బిడ్డ ప్రభావం కనిపించిందని.. వివరించారు. అంతేకాదు పుట్టిన ఘడియలు కూడా శుభకరమైనవని పెద్దలు తెలియజేసినట్లు ఎంతగానో సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే నేడు హాస్పిటల్ నుండి ఉపాసన మరియు చరణ్ డిశ్చార్జ్ కావడం జరిగింది. డిశ్చార్జ్ అనంతరం మీడియా సమావేశం నిర్వహించి చరణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా పేరు గురించి వివరణ ఇస్తూ నేను ఉపాసన ఆల్రెడీ పాపకి ఒక పేరు అనుకున్నాం. అది 13వ రోజు లేదా 21 రోజు అధికారికంగా ప్రకటిస్తామని మీడియా సమక్షంలో చరణ్ తెలియజేశారు. ఇదే సమయంలో నా కూతురుకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. పాపా మరియు ఉపాసన హెల్దిగా ఉన్నారు. మీ అందరికీ థాంక్స్ అంటూ చరణ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పాప ఎవరు పోలిక లాగా ఉంటుందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… ఇంకెవరు నాలాగే ఉంటది.. అంటూ చరణ్ చాలా సరదాగా మీడియాతో సంభాషించడం జరిగింది. కచ్చితంగా పాపకు నామకరణం చేసే విషయంలో పేరు 13వ రోజు లేదా 21 రోజు అందరికీ అధికారికంగా ప్రకటిస్తామని చరణ్ తెలియజేయడం జరిగింది.
భగవంతుడి దయవల్ల అనుకున్న సమయానికి.. ఇలా జరగటం చాలా సంతోషంగా ఉంది అని చరణ్ చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఇదిలా ఉంటే కూతురు పుట్టిన నేపథ్యంలో ఇండస్ట్రీలో ఉన్న స్నేహితులకు మరియు హీరోలకు బిగ్ పార్టీ చరణ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో ఇంట్లో పని చేస్తున్న వారికి బోనస్ లు ఆల్రెడీ ఇవ్వటం జరిగిందంట. కూతురు పుట్టడంతో కొంతకాలం నుండి సెపరేట్ గా ఉంటున్న చరణ్ ఇప్పుడు మళ్లీ చిరంజీవితో ఇంట్లోకి షిఫ్ట్ అయిపోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.