35.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Rajamouli Mahesh: మహేష్ సినిమాకి బిగ్ ప్లాన్ ఇండియాలో ఏ హీరోకి అందని రీతిలో రాజమౌళి ప్లాన్..?

Share

Rajamouli Mahesh: ప్రపంచ సినిమా రంగంలో రాజమౌళి పేరు మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి 2, RRR సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ ₹1000 కోట్లు కలెక్ట్ చేసిన దర్శకుడిగా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. “RRR” సినిమాతో పలు అంతర్జాతీయ అవార్డులో కూడా జక్కన్న సొంతం చేసుకున్నారు. ఇక ఇదే సమయంలో “RRR” ప్రస్తుతం ఆస్కార్ రేసులో ఉంది. “RRR” సినిమా రాజమౌళికి మంచి పేరు తీసుకురావడం జరిగింది. దీంతో ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాపై అంతర్జాతీయంగా… మంచి ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక ప్రకటన రానున్నట్లు సమాచారం.

The big plan of Mahesh's movie is Rajamouli's plan unlike any hero in India

ఇదిలా ఉంటే ఈ సినిమాని ఇండియాలో ఏ హీరోకి దక్కని రీతిలో రూపొందించడానికి రాజమౌళి బిగ్ ప్లాన్ చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. విషయంలోకి వెళ్తే ₹1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 30 భాషల్లో విడుదలయ్యేలా సరికొత్త నిర్ణయం తీసుకున్నారట. అయితే థియేటర్ పరంగా మాత్రము కాక ఓటిటి సంస్థలలో ఈ సినిమాని 30 భాషలలో రిలీజ్ చెయ్యనున్నట్లు టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ సినిమా నిర్మాణ భాగస్వామ్యంలో హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు సైతం చేతులు కలుపుతున్నట్లు సమాచారం.

The big plan of Mahesh's movie is Rajamouli's plan unlike any hero in India

“ఇండియానా జోన్స్” తరహాలో పార్ట్స్ గా ఈ సినిమా రాజమౌళి తెరకెక్కించనున్నారు అంట. మే నెలలో సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే నాడు అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజమౌళి “RRR” అంతర్జాతీయ అవార్డుల కార్యక్రమాలకు సంబంధించి ఫుల్ బిజీగా ఉన్నారు. మరోపక్క మహేష్ త్రివిక్రమ్ తో చేస్తున్న ప్రాజెక్టు పనులలో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ అయిన వెంటనే… రాజమౌళితో చేయబోయే సినిమా షూటింగ్లో మహేష్ జాయిన్ కానున్నారు.


Share

Related posts

Intinti Gruhalakshmi: తులసి అంకితను ఇంట్లో నుంచి పంపించెస్తుందా.. ప్రేమ్ కి పంగనామం పెట్టాడా డైరెక్టర్

bharani jella

KGF 2: తెలుగు రాష్ట్రాల్లో భారీ ధ‌ర ప‌లికిన `కేజీఎఫ్ 2`.. ఎంతో తెలిస్తే మైండ్‌బ్లాకే!

kavya N

NANI: నానికి హిందీలో మార్కెట్ లేదా..మరి పాన్ ఇండియా టార్గెట్ ఎలా..?

GRK