Ileana: గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2006లో రామ్ పోతినేని తో “దేవదాసు” సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది. ఆర్.బీ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఇలియానా రెండో సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా “పోకిరి” సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. పోకిరి విజయంతో ఇలియానా తలరాత ఒక్కసారిగా మారిపోయింది. అందమైన నడుముతో పాటు నటనతో ఇంకా డాన్స్ పరంగా అప్పట్లో సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.
దీంతో వరుసగా టాప్ మోస్ట్ హీరోలు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్… మరి కొంతమంది కుర్ర హీరోలతో అవకాశాలు అందుకుని కొన్ని సంవత్సరాలు పాటు విజయాలు సాధించింది. సౌత్ లో క్రేజ్ బాగా పెరిగిన తర్వాత ఇక పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి మకాం మార్చింది. హిందీలో స్టార్టింగ్ అవకాశాలు వచ్చినా గాని తర్వాత వరుసగా పరాజయాలు పలకరించటంతో మళ్లీ లైఫ్ ఇచ్చిన సౌత్ వైపు చూసి.. అవకాశాలు అందుకోవటం జరిగింది. కానీ సౌత్ లో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇలియానా కి.. సరైన హిట్టు పడలేదు. అనంతరం సినిమాలకు దూరమైన ఇలియానా రీసెంట్ గానే పెళ్లి కాకుండానే తన బాయ్ ఫ్రెండ్ తో ఓ బిడ్డకి జన్మనివ్వడం జరిగింది.
అంతేకాకుండా ఫోటోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది. అయితే కొన్నాళ్లపాటు అవకాశాలు లేక కెరియర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇలియానాకి బిడ్డ పుట్టిన వేల విశేషమేమో తెలియదు గాని.. తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ ఆఫర్ గోవా బ్యూటీ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ నటించమంటూ స్టార్ డైరెక్టర్ ఆమెకు ఆఫర్ ఇచ్చారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చర్చల దశలో ఉన్నట్లు అంతా ఓకే అయితే త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం.