న్యూస్ సినిమా

ఈ ఫొటోలో ఉన్న పిల్లోడు ఇప్పుడో స్టార్ హీరో.. ఎవరో గెస్ చేయండి!

Share

ఒకప్పుడు వెండి తెరపై బాలనటులుగా పరిచయమైన కొంతమంది నటులు ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా మారారు. బాలకృష్ణ, మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్ లాంటి చాలా మంది ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్స్‌గా వెండి తెరపై నటించిన వారే. ఇప్పుడు వారే టాప్ హీరోలుగా ఇండస్ట్రీని ఏలుతున్నారు. కానీ తరుణ్, మంచు మనోజ్, బాలదిత్య వంటి బాలనటులకు మాత్రం అదృష్టం కలిసిరాక కొన్ని సినిమాలకే పరిమితం అయ్యారు. అయితే ఈ కాలంలో హీరోలుగా రాణిస్తున్న వారు ఆ కాలంలో బాలనటులుగా నటించారనే విషయం తెలిసినా వారు ఎలా ఉండేవారు? ఏ సినిమాలో నటించారనేది మాత్రం చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. అయితే తాజాగా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇందులో ఉన్నది ఎవరనేది చాలామంది చేయలేకపోతున్నారు.

ఎవరీ హీరో

Child Artist

మీరు పై ఫొటోలో చూస్తున్న బాలనటుడు ఇప్పుడు ఒక టాలీవుడ్ సీనియర్ హీరో. ఈ హీరోని చాలా సినిమాలలో చూసే ఉంటారు. ఆయన బాలనటుడిగా నటించిన సినిమాలు చాలా తక్కువ. అఖినేని నాగేశ్వరావు నటించిన ఒక సినిమాలోనే అతను బాలనటుడిగా నటించాడు. ఆ తరువాత ఎన్నో మంచి సినిమాలలో హీరోగా నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అతను ఎవరా అని అనుకుంటున్నారా?

ఎవరో గెస్ చేశారా

Hero Venkatesh

ఈ ఫోటోలో వున్నది ఎవరో కాదు విక్టరీ వెంకటేష్. 1971లో విడుదల అయిన ప్రేమ్ నగర్ సినిమాలో వెంకటేష్ బాలనటుడిగా కనిపించారు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై వచ్చిన ఈ మూవీలో ఏఎన్ఆర్, వాణిశ్రీ హీరో హీరోయిన్లగా నటించారు. వెంకటేష్ చిన్ననాటి విలన్ పాత్రలో కనిపిస్తాడు.

Venkatesh

వెంకీ డిసెంబర్ 13న ప్రకాశం జిల్లా కారంచెడులో జన్మించారు. 1986లో కళియుగపాండవులు అనే సినిమాలో బాలనటుడిగా పరిచయం అయిన వెంకటేష్ అప్పటినుండి ఇప్పటివరకు వరుస సినిమాలతో ప్రేక్షకులను అల్లరిస్తూనే వున్నాడు.


Share

Related posts

ఢిల్లీలో ఏం జరుగుతుంది…?

Srinivas Manem

వైసిపిలో చేరిన మంత్రి సోమిరెడ్డి బావ

somaraju sharma

శుభవార్త: భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎంత తగ్గాయో తెలుసా?

Teja