SreeLeela: 2021వ సంవత్సరంలో కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన “పెళ్లి సందడి”తో శ్రీలీల తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాతో పరవాలేదు అనిపించిన ఈ ముద్దుగుమ్మ తరువాత వరుస పెట్టి అవకాశాలు అందుకుని రెండు సంవత్సరాల కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది. ప్రస్తుతం తెలుగు చలనచిత్ర రంగంలో అగ్ర హీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న గుంటూరు కారం, హరిష్ శంకర్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్… సినిమాలలో నటిస్తోంది. మొన్ననే బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి, రామ్ నటించిన స్కంద సినిమాలు చేయడం జరిగింది.
త్వరలో మెగా హీరో వైష్ణవి తేజ్ “ఆదికేశవ” సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతూ ఉంది. ఆల్రెడీ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. చాలావరకు తెలుగు సినిమా రంగంలో స్టార్ దర్శకులు హీరోయిన్ విషయంలో శ్రీలీలకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఈ క్రమంలో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వస్తూ ఉండటంతో పాటు డిమాండ్ పెరుగుతుండటంతో దర్శకులకు కొత్త కొత్త కండిషన్స్ పెడుతూ ఉందట. ఈ క్రమంలో ఒక్కోసారి ట్విస్టులు కూడా ఇస్తూ ఉందట. మేటర్ లోకి వెళ్తే ముందుగా అడిగితేనే కాల్ షీట్స్ ఇస్తుందట. ఆ తర్వాత అడిగితే నిర్మోహమాటంగా లేవని చెప్పేస్తూ ఉందట.
కాల్ షీట్స్ విషయంలో చాలా పక్కాగా ముందే దర్శకులకు తెలియజేస్తూ ఉందట. ఈ క్రమంలో ఒక్కోసారి ఆమె కాల్ షీట్స్ ఉన్నాగాని ఏదో కారణం తో సినిమా షూట్ లేట్ అయినా పోస్ట్ పోన్ అయినా బాధపడుతూ ఉన్నారట. అందుకే ముందు నుంచే జాగ్రత్త పడుతూ శ్రీలీల కాల్ షీట్స్ విషయంలో దర్శకులు ఆచితూచి అడుగులు వేస్తున్నారట. దీంతో శ్రీలీల షూట్ విషయంలో నిర్మాతలు హీరోల కంటే ఎక్కువగా అప్రమత్తంగా ఉంటూ ఆరోజు చోటు మొత్తం కంప్లీట్ అయ్యేలా.. ముందు జాగ్రత్త పడుతున్నారట. ఏమైనా తేడా పడితే ఆమె కాల్ షీట్ రోజు షూట్ క్యాన్సిల్ అయితే చాలా కోట్లు నష్టం ఏర్పడే పరిస్థితి ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల చేస్తున్న సినిమాలకు ఏర్పడే పరిస్థితి నెలకొందట. దీంతో శ్రీ లీల సినిమాలు చేస్తున్న నిర్మాతలు గడగడ వణుకుతున్నారట.