War 2: హృతిక్ రోషన్ హీరోగా “వార్ 2” తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ రోల్ కోసం మొదట ప్రభాస్ నీ అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని… ఆదిత్య చాప్రా ఈ సినిమాకు మొదట ఎన్టీఆర్ యే ఫస్ట్ ఎంపిక అని మేకర్స్ స్పష్టం చేశారు. గత ఐదు నెలలుగా ఎన్టీఆర్ తో చర్చలు జరిపితే మార్చిలో కన్ఫర్మ్ అయినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్.
ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా కావటంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేయడం విశేషం. కాగా ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో ఎన్టీఆర్ కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. మే నెలలో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ రివిల్ చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఒకపక్క కొరటాల సినిమా చేస్తూనే మరోపక్క “వార్ 2” చేయటానికి ఎన్టీఆర్ రెడీ అయినట్లు సమాచారం.RRR తో ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందడంతో..”వార్ 2″కి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. నెగిటివ్ రోల్ లో ఎన్టీఆర్ నీ చాలా పవర్ ఫుల్ గా ఆదిత్య చాపల చూపించబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. సో దీన్ని బట్టి చూస్తే ఫస్ట్ టైం ఎన్టీఆర్ బాలీవుడ్ లో మల్టీ స్టారర్ రూపంలో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.