Tom Cruise: సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు పెళ్లిళ్లు చేసుకుని ఎక్కువగా సంసార జీవితం సాగించలేరు. ఈ క్రమంలో పెళ్లి చేసుకున్న చాలామంది విడాకులు తీసుకున్న వారు ఉన్నారు. ఇదే క్రమంలో విడాకులు తీసుకున్న తర్వాత మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఈ రకంగానే హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరో భార్య వయసు 30 ఏళ్లు దాటితే చాలు.. మార్చేయడం అతని స్టైల్.

ఈ రకంగా అతడు ముగ్గురు భార్యలను వదిలేశాడు. ఆ హీరో మరి ఎవరో కాదు మిషన్ ఇంపాజిబుల్ సిరిస్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన టామ్ క్రూజ్. 60 సంవత్సరాలకు పైగా వయసు కలిగిన టామ్… ఇప్పటికీ కూడా తాను చేయబోయే సినిమాలలో ఒళ్ళు గగుర్పుడిచే స్టంట్స్ చేస్తూ ఉంటాడు. ఈ హాలీవుడ్ సూపర్ స్టార్ కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. హాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్షన్ స్టార్ హీరోగా ఇమేజ్ సంపాదించుకోవడం జరిగింది.

ఫ్రాంచేజి మూవీ “మిషన్ ఇంపాజిబుల్ 7” ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. హీరోగా ఇంత పాపులారిటీ కలిగిన టామ్.. వ్యక్తిగత విషయాలలో చాలా విచిత్రమైన రిలేషన్స్ కలిగిన వ్యక్తి. తనకంటే 11 సంవత్సరాల వయస్సు తక్కువ కలిగిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్న టామ్… వాళ్లకి 33 సంవత్సరాలు వచ్చే సమయానికి విడాకులు ఇచ్చి వదిలించుకోవడం జరిగింది. ఫస్ట్ టైం 1987లో మీమీ రోజర్స్ నీ పెళ్లి చేసుకోగా… ఆమెకు 33 సంవత్సరాలు వయసు రాగానే 1990లో విడాకులు ఇవ్వడం జరిగింది.

తర్వాత నికోల్ కిడ్ మాన్ పెళ్లి చేసుకోగా ఆమెకు 33 సంవత్సరాలు రాగానే..2001లో విడాకులు ఇవ్వడం జరిగింది. కేటి హోమ్స్ నీ తర్వాత పెళ్లి చేసుకోగా ఆమెకు కూడా… 33 సంవత్సరాలు రాగానే టామ్ విడాకులు ఇవ్వడం జరిగింది. కేవలం యాధృచ్చికం అని అనుకోకపోతే.. అతని భార్యలు ప్రతి ఒక్కరు మునుపటి కంటే 11 సంవత్సరాలు చిన్నవారు.

2023 నాటికి మిమీ రోజర్స్‌కు 66 ఏళ్లు, నికోల్ కిడ్‌మాన్‌కు 55 ఏళ్లు, కేటీ హోమ్స్‌కు 44 ఏళ్లు. ఈ రకంగా యాక్షన్ హీరో తన వ్యక్తిగత జీవితంలో అనుకోకుండా లేదా కావాలనో… భార్యలకు వయసు 30 దాటగానే మోజు తీర్చుకొని.. విడాకులు తీసుకోవటం జరిగింది.