The Kashmir Files: ఇపుడు ఎక్కడ విన్నా ఒకటే సినిమా గురించి చర్చ. అదే ‘ది కశ్మీర్ ఫైల్స్’. 1990లో కశ్మీరీ పండిట్లపై జరిగిన ఊచకోతను కథాంశంగా తీసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం బాక్షాఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేసింది. కేవలం రూ. 3 నుంచి 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రూ. 200 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. ఆ రోజుల్లో కశ్మీరీ పండిట్లు అనుభవించిన నరకాన్ని ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించారు. సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
The Kashmir Files: మరుగునపడిపోయిన విషయాలను ఇందులో చూపించాను, చూడండి: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు
The Kashmir Files: పొంచివున్న ప్రమాదం!
ఇదిలావుంచితే, వివేక్ అగ్నిహోత్రికి ఓ వర్గం నుండి ముప్పు పొంచి ఉండే అవకాశం ఉండటంతో.. కేంద్ర హోం శాఖ ఆయనకు ‘వై’ కేటగిరీ భద్రతను కేటాయించడం కొసమెరుపు. దేశంలో ఆయన ఎక్కడకు వెళ్లినా CRPF బలగాలతో భద్రతను కల్పిస్తారు. ఇప్పటికే బాలీవుడ్ భామ కంగనా రనౌత్ కు ‘వై’ కేటగిరీ భద్రత ఉన్న సంగతి తెలిసిందే. ఇక విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై చేసిన ట్వీట్ సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది. ఓ వీడియోను పోస్ట్ చేసిన ప్రకాశ్ రాజ్.. ‘కశ్మీర్ ఫైల్స్ చిత్రం గాయాలను నయం చేస్తుందా? లేక మరింత రెచ్చగొడుతుందా? జస్ట్ ఆస్కింగ్ అంటూ ఓ ట్వీట్ తో హీట్ ఎక్కించారు.
కరోనా విషయంలో ఐక్యరాజ్యసమితి సరికొత్త హెచ్చరికలు..!!
ప్రకాశ్ రాజ్ అంతరంగం ఏమిటి?
దీంతో ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో ప్రకాశ్ రాజ్ కూడా చేరిపోయారు. ఎదిఎలావున్నా ఈ చిత్రం రోజురోజుకు ఊహించని విధంగా కలెక్షన్లు సాధిస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రధాని మోదీ నుండి.. బీజేపీ నాయకులెందరో ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంకా ప్రముఖులెందరో ఈ చిత్రాన్ని పొగుడుతూనే ఉన్నారు. కొన్ని రాష్ట్రాలు అయితే ఈ చిత్రానికి టాక్స్ బెనిఫిట్స్ కూడా ప్రకటించడం కొసమెరుపు.