కమల్ హాసన్ కూతురుగా వెండితెరకు పరిచయమైన శృతిహాసన్ అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీ లో మాత్రమే కాక బాలీవుడ్ లో కూడా రాణించడం జరిగింది. అంతేకాకుండా ఇటలీ దేశానికి చెందిన సంగీతకారుడు మైఖేల్ కోర్సలేతో రిలేషన్ లో ఉన్న శృతిహాసన్ తర్వాత అతనితో విడిపోవడం జరిగింది.
ఈ దెబ్బతో చాలావరకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన శృతిహాసన్ పెద్ద సినిమాలు చేయకుండా మొన్నటి వరకు రాణించడం జరిగింది. ఇదిలాఉంటే ఇటీవల అభిమానులతో ఇంస్టాగ్రామ్ లో చిట్ చాట్ చేస్తున్న తరుణంలో తన లవ్ గురించి సరికొత్త విషయాలు పంచుకుంది. చిట్ చాట్ లో భాగంగా అభిమాని మీరు ఇంకా రిలేషన్షిప్ లో ఉన్నారా అంటూ ప్రశ్న వేయడం జరిగింది.
దానికి శృతిహాసన్ సమాధానమిస్తూ ‘ట్రూ.. ఐ గెస్’ అని చెప్పింది. దీంతో ఆ ప్రేమికుడు ఎవరు..? అనే చర్చ మొదలైంది. ఇదే తరుణంలో మరొక అభిమాని మాజీ బాయ్ ఫ్రెండ్ ని ఇంకా ద్వేషిస్తున్నారా? అని అడగ్గా.. చిన్న స్మైల్ ఇచ్చిన శృతి.. ‘కాదు’ అని చెప్పింది. దీంతో శృతి హాసన్ లవ్ మళ్లీ చిగురించినట్లు సోషల్ మీడియాలో డిస్కషన్లు జరుగుతున్నాయి.