22.7 C
Hyderabad
March 24, 2023
NewsOrbit
Entertainment News సినిమా

NTR 30: “NTR 30” మూవీ షూటింగ్ ముహూర్తం డీటెయిల్స్ ప్రకటించిన మేకర్స్..!!

Share

NTR 30: “RRR” సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. కొమరం భీం పాత్రను దేశంలోనే కాదు విదేశీ ప్రేక్షకులను తారక్ నటన ఎంతగానో ఆకట్టుకుంది. ఇంకా కొమరం భీమ్ సాంగులో సైతం… ఎన్టీఆర్ హావభావాలకీ హాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కాగా ఇప్పుడు ఎన్టీఆర్ తన కెరియర్ లో 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ముహూర్తం తేదీని మేకర్స్ ప్రకటించారు.

The makers of NTR 30 movie shooting details have announced

ఈనెల 23వ తారీఖు నాడు పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నట్లు పోస్టర్ తో కూడిన… వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ గత నెల 24వ తారీఖు ప్రారంభం కావాల్సింది. ఆ సమయంలో నందమూరి తారకరత్న మరణించడంతో… పూజా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. కాగా ఈ నెల 23వ తారీకు.. పూజ కార్యక్రమాలు స్టార్ట్ చేసి ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ తో… ఏకతాటిగా చిత్రీకరణ చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. “RRR” తో అంతర్జాతీయ స్థాయిలో తారక్ కీ మార్కెట్ క్రియేట్ కావడంతో “NTR 30” పాన్ ఇండియా లెవెల్ లో చిత్రీకరిస్తున్నారట.

The makers of NTR 30 movie shooting details have announced

తన కెరీర్ లో జక్కన్నతో చేసిన తర్వాత అనేక పరాజయాలు రావటంతో ఈ సినిమా విషయంలో తారక్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. మరోపక్క కొరటాల సైతం ఈ ప్రాజెక్టు నీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. కెరియర్ స్టార్టింగ్ నుండి వరుసగా బ్లాక్ పాస్టర్లు అందుకోగా… మధ్యలో “ఆచార్య” అట్టర్ ప్లాప్ కావడంతో ఈ సినిమాతో.. మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని కొరటాల స్క్రిప్ట్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారట. గతంలో కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ ప్రాజెక్టుపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


Share

Related posts

మహానటిని బతిమాలడం కోసం రంగంలోకి దిగిన మహేశ్ బాబు… ఫాన్స్ హార్ట్ ఐనా పర్లేదు !!

arun kanna

Varalaxmi Sarath kumar Cute Looks

Gallery Desk

Pooja Hegde: ఫ్లైట్‌లో పూజా హెగ్డేకు చేదు అనుభ‌వం..ట్విట్ట‌ర్‌లో బుట్ట‌బొమ్మ ఆవేద‌న!

kavya N