25.7 C
Hyderabad
April 1, 2023
NewsOrbit
Entertainment News సినిమా

RC 15: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రామ్ చరణ్… శంకర్ సినిమా కొత్త టైటిల్..?

Share

RC 15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ “RRR” సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఊహించని గుర్తింపు సాధించాడు. అమెరికాలో పేరుగాంచిన మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వటం మాత్రమే కాదు భారతీయ చలనచిత్ర రంగం యొక్క గొప్పతనాన్ని చాటుతూ… అదేవిధంగా రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది. కాగా ఈనెల 13వ తారీకు ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ క్రమంలో రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ అమెరికాలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే మార్చి 27వ తారీకు రామ్ చరణ్ పుట్టినరోజు నేపథ్యంలో… శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయాలని… అనుకుంటున్నారట.

The new title of Ram Charan Shankar movie which is going viral on social media

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమా టైటిల్ వైరల్ అవుతుంది. “CEO” అనే టైటిల్ పెట్టినట్లు… మూడు విభిన్నమైన పాత్రలలో చరణ్ కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకదా త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేయనున్నారు అంట. మూడు పాత్రలలో ఒకటి ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు రాజకీయ నాయకుడిగా కూడా చరణ్ చేసినట్లు సమాచారం. మెజార్టీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా లో శ్రీకాంత్, ఎస్ జె సూర్య, నవీన్ చంద్ర, అంజలి కీలక పాత్రలు చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

The new title of Ram Charan Shankar movie which is going viral on social media

పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా. దీంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. చరణ్ కెరియర్ లోని ఇది అత్యంత హై బడ్జెట్ మూవీ. ఈ సినిమాలో ఒక సాంగ్ లో చరణ్ వేసే స్టెప్పులు చాలా హైలెట్ గా ఉండనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సాంగ్ ని జానీ మాస్టర్ కంపోజ్ చేయడం జరిగింది. RRR తర్వాత చరణ్ చేస్తున్న సినిమా కావటంతో “RC 15” పై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Share

Related posts

Rashmika mandanna : రష్మిక మందన్న లేటెస్ట్ వీడియోతో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది..!

GRK

పవన్ కల్యాణ్ ఫాన్స్ కి వకీల్ సాబ్ కంటే పవర్ ఫుల్ టైటిల్ దొరికింది .. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ

GRK

Mythri Movie Makers: టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థలను తొక్కిపెడుతున్న మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers)…!

GRK