RRR: గత ఏడాది మార్చి నెలలో విడుదలైన “RRR” ప్రపంచ సినిమా రంగంలోనే సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో భారతదేశ చలనచిత్ర పరిశ్రమ యొక్క స్థాయి పెరిగింది. ఇంక దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ప్రపంచ సుప్రసిద్ధ దర్శకుడు జేమ్స్ కామెరూన్… “RRR” సినిమా నీ కుటుంబ సమేతంగా రెండుసార్లు తిలకించి… ఎంతో ఇష్టపడటం జరిగింది. అంత మాత్రమే కాదు రాజమౌళితో కలసి పనిచేయటానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు జేమ్స్ కామెరూన్ బహిరంగంగా మీడియా సమక్షంలో ప్రకటించారు. మార్చి నెలలో ఈ సినిమా ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు గెలవడం తెలిసిందే. “నాటు నాటు” సాంగ్ కి.. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవానికి లిరిక్స్ రాసిన చంద్రబోస్ కి ఆస్కార్ లభించింది.
ఇదిలా ఉంటే జపాన్ దేశంలో గత ఏడాది అక్టోబర్ నెలలో “RRR” వారి భాషలో రిలీజ్ కావటం తెలిసిందే. అప్పటి నుండి ప్రదర్శన అవుతున్న ఈ సినిమా ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూ ఉంది. జపాన్ లో విడుదలై 186 రోజులు(27 వారాలు) పూర్తికా వస్తోంది. అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి ఆదరణ తగ్గటం లేదు. దీంతో ఇటీవల ఆన్ లైన్ బుకింగ్ ర్యాంకింగ్స్ లో వరల్డ్ వైడ్ గా టాప్ 10 లోకి తిరిగి రావడం జరిగింది. దీంతో టైటానిక్ సినిమాని పక్కన పెట్టి ఆల్ టైం హైయెస్ట్ మల్టీ ప్లేయర్ గా అవతరించే దిశగా “RRR” దూసుకుపోతుంది.
అక్కడ అల్ రెడీ 25 సంవత్సరాల క్రితం రజనీకాంత్ క్రియేట్ చేసిన “ముత్తు” సినిమా రికార్డులను “RRR” బ్రేక్ చేయడం జరిగింది. దీంతో ఇండియా దేశం నుండి విడుదలైన సినిమాలలో “RRR” జపాన్ దేశంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంది. మార్చి నెలలో ఆస్కార్ అవార్డు గెలిచాక … జపాన్ లో RRR సినిమాకి మరింత ఆదరణ పెరిగినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకి సీక్వెల్ ఆలోచనలో రాజమౌళి ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ పనిలో ఉన్న జక్కన్న… అది కంప్లీట్ అయిన వెంటనే.. “RRR 2” చేయనున్నట్లు సమాచారం.