Unstoppable 2: “అన్ స్టాపబుల్” టాకీ షో విజయవంతంగా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ షో మొదటి సీజన్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలకృష్ణ తన హోస్టింగ్ తో ఇరగదీసేశారు. హీరోగా కంటే బాలయ్య యాంకరింగ్ గా అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ షో తో బాలయ్య క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆయనలో ఉన్న జోష్.. ఆయనని ఇదివరకు విమర్శించిన వారు సైతం ఈ షో చూశాక మెచ్చుకునే పరిస్థితి నెలకొంది. పెద్దవాళ్లను చిన్నవాళ్లను ఇంకా కుర్ర హీరోలను తనదైన శైలిలో డీల్ చేస్తూ షో నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ప్రస్తుతం సెకండ్ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఇంకా రెండు మూడు ఎపిసోడ్ లు కంప్లీట్ అయితే చివరి దశకు చేరుకున్నట్టే. దీంతో ఇప్పటికే చాలామంది బిగ్ స్టార్స్ షో కి రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏడాది చివరిలో ఉండటంతో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నీ తీసుకొచ్చారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా వచ్చారు. అయితే ప్రభాస్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నారు.
ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 30వ తారీకు రిలీజ్ చేస్తున్నట్లు నిన్న తెలియజేయగా అభిమానుల నుండి వచ్చిన ఒత్తిడి మేరకు ఈ రోజు రాత్రికే ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమ్ చేస్తున్నట్లు ఆహా టీం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంతో ప్రభాస్ అభిమానులు రాత్రి తొమ్మిది ఎప్పుడు అవుతుందో అనీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షో మధ్యలో చరణ్ ఫోన్ కాల్ చేయటం ఇంకా పెళ్లికి సంబంధించి ప్రభాస్ ఇచ్చిన సమాధానాలు… వంటి విషయాలు తెలుసుకోవడానికి ఎంతో ఆత్రుతగా ఉన్నారు. ఇక గోపీచంద్ తో ఒక హీరోయిన్ విషయంలో గొడవ ఎలాంటి విషయాలు ప్రోమోలో చూపించడంతో వీటన్నిటిని చూడటానికి ఫ్యాన్స్ మంచి ఉత్సాహం మీద ఉన్నారు.