KGF 3: కన్నడ స్టార్ హీరో యాష్ “కేజిఎఫ్” సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించడం తెలిసిందే. “KGF” సినిమాలు రాకముందు యాష్ పేరు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే వినబడేది. సీరియల్స్ లో యాక్ట్ చేస్తూ తర్వాత హీరోగా ఎదిగి.. కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే “KGF” సినిమా చేయడం జరిగిందో..యాష్ తన కెరియర్ తోపాటు కన్నడ ఇండస్ట్రీ రూపురేఖలు కూడా మార్చేశాడు. ఎందుకంటే ఇండియాలో అతి చిన్న ఫిలిం ఇండస్ట్రీ గా కన్నడ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకునే వాళ్ళు. “KGF” అన్ని భాషలలో విడుదలై అనే రికార్డులు కలెక్షన్ సాధించడంతో.. భారతదేశ సినీ ప్రేమికులు మొత్తం కన్నడ వైపు చూశారు.

“KGF 2” సైతం బారి హిట్ కావడంతో పాటు ఇండియాలో ₹1000 కోట్లు కలెక్ట్ చేయడం సంచలనం సృష్టించింది. ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ₹400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తెలుగులో ₹100 కోట్లకు పైగానే కలెక్షన్ రాబట్టింది. అయితే “కేజీఎఫ్ 2” క్లైమాక్స్ లో మూడో పార్ట్ ఉన్నట్లు హింట్ ఇవ్వటం తెలిసిందే. దీంతో అప్పటి నుండి కేజిఎఫ్ మూడో భాగం ప్రకటనపై అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే జనవరి 8 ఆదివారం యాష్ పుట్టినరోజు నేపథ్యంలో… కేజిఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే అధినేత విజయ్ సరికొత్త అప్డేట్ ఇచ్చారు. “కేజిఎఫ్ 3” వచ్చే ఏడాది లేదా 2025లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ “సలార్” చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు అక్టోబర్ నెలలో కంప్లీట్ కానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా కంప్లీట్ అయ్యాక… “కేజిఎఫ్ 3” స్టార్ట్ అవుతుందని చెప్పుకొచ్చారు. ప్రభాస్.. ఎన్టీఆర్ సినిమాల తర్వాతే ప్రశాంత్ నీల్…యాష్ తో “కేజిఎఫ్ 3” చేస్తారని స్పష్టం చేశారు. మూడో భాగం స్టోరీ మరింత పవర్ ఫుల్ గా ప్రపంచ సినీ ప్రేమికులను ఆకట్టుకునే రీతిలో ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
‘మా’లో మరో సారి విభేదాలు బహిర్గతం!