Salaar: “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా “సలార్” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వరుస పరాజయాలతో ఉన్న ప్రభాస్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరోపక్క కేజిఎఫ్ వంటి రికార్డు స్థాయి సినిమా తెరకెక్కించిన దర్శకుడు ప్రభాస్ తో సినిమా చేస్తూ ఉండటం తో ఈ సినిమా పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతకుముందే బాహుబలి 2 తో ప్రభాస్ ఫ్యాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోవడం తో.. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న “సలార్” పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమా బడ్జెట్ ప్రారంభంలో 200 కోట్లు అనుకోగా… ఇప్పుడు మరింతగా 40 కోట్లు అదనంగా పెరిగినట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది. KGF 2 తర్వాత ప్రభాస్ క్రేజ్ కి తగ్గట్లుగా అంచనాలను అందుకోవడానికి.. స్క్రిప్టులో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు.. అందువల్లే బడ్జెట్ పెరిగిందని సమాచారం. కొత్తగా యాడ్ చేసిన సన్నివేశాలు కూడా హాంబలే నిర్మాణ సంస్థ కు అనుకూలంగా ఉండటంతో.. నచ్చడంతో వాళ్లు కూడా ఏ మాత్రం ఆలోచించకుండా పెరిగిన బడ్జెట్ కి ఓకే చెప్పినట్లు టాక్.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. త్వరలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది వేసవి ని టార్గెట్ చేసుకుని తీస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు సమాచారం. యాక్షన్ సన్నివేశాలకి సంబంధించి… ప్రొఫెషనల్ ఫైటర్స్ నీ ప్రశాంత్ నీల్ ప్రత్యేకంగా విదేశాలనుండి తేపించినట్లు బెస్ట్ వర్గాలలో టాక్.
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…
KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…
Naresh’s third wife ramya attack: సీనియర్ నటుడు నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ల వ్యవహారం ఎలక్ట్రానిక్ ...…