Samantha: గత ఏడాది అక్టోబర్ నెల నుండి స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే వ్యాధికి గురికావడం తెలిసిందే. ప్రాణాంతకరమైన ఈ వ్యాధి కారణంగా దాదాపు మూడు నెలలు పాటు చికిత్స తీసుకుంటూ సినిమాలకు దూరమయి బెడ్ రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో సమంత కోలుకోవాలని ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలబ్రిటీలు సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా వ్యాధి వచ్చిన సమయంలో పోస్ట్ పెట్టారు. అయితే మాజీ భర్త నాగచైతన్యతో సమంత విడిపోవడంతో ఆమె ఒంటరిగా ఉండటంతో అభిమానులు ఈ విషయంలో ఎంతో ఫీలయ్యారు.
ఇలాంటి సమయంలో సమంతకి నాగచైతన్య తోడు అవసరమని… సోషల్ మీడియాలో భారీ ఎత్తున కామెంట్లు పెట్టారు. ఇదిలా ఉంటే ఆ టైంలో అక్కినేని ఫ్యామిలీ నుండి అఖిల్.. సమంత త్వరగా కోలుకోవాలని.. మనోధైర్యం చెబుతూ పోస్ట్ పెట్టడం జరిగింది. నాగచైతన్యతో డైవర్స్ తీసుకున్నాక సమంత చాలా వరకు అక్కినేని బంధువులకు దూరమైనట్లు వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇటువంటి క్రమంలో నాగచైతన్య కి దగ్గర బంధువు టాలీవుడ్ స్టార్ హీరో రానా మాత్రం సమంత విషయంలో చాలా కేర్ తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని ఇటీవల రానా తెలియజేశారు.
మేటర్ లోకి వెళ్తే తనకి సమయం దొరికినప్పుడల్లా హీరోయిన్ సమంతతో మాట్లాడుతున్నట్లు రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. సమంత మయోసైటీస్ వ్యాధికి గురైన సంగతి తెలుసుకున్న వెంటనే ఆమెతో ఫోన్ లో మాట్లాడటం జరిగింది. ఆమె పరిస్థితి యోగక్షేమాలు మొత్తం అడిగి తెలుసుకున్నాను. నటీనటులు తమకున్న సమస్యలు బయట ప్రపంచానికి చెప్పాలా వద్దా అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. వాటిని ఎదుర్కొని ముందుకు సాగటంలోని ఆనందం ఉంటుందని రానా తెలియజేశారు.