Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ విడుదలయ్యే సినిమా “వాల్తేరు వీరయ్య”. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ కీలకపాత్ర పోషించడం జరిగింది. శృతిహాసన్ హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన “బాస్ సాంగ్” ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. యూట్యూబ్ లో అనేక వ్యూస్ తో పాటు రికార్డుల క్రియేట్ చేసింది. ఈ క్రమంలో నిన్న విడుదలైన టైటిల్ సాంగ్.. అభిమానులను మరింతగా ఆకట్టుకుంటూ ఉంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బాణీలు.. సినిమాపై మరింత అంచనాలు పెంచే రీతిగా ఈ పాట ట్యూన్స్ ఉన్నాయి.

ఇంచుమించు బాస్ పార్టీ సాంగ్ కి… తగ్గట్టుగానే “వాల్తేరు వీరయ్య” టైటిల్ సాంగ్ ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తారీకు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. వీరయ్య క్యారెక్టర్ లో చిరంజీవి నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా కంప్లీట్ కావడంతోపాటు ఫుల్ సినిమా చూసిన సినిమా డైరెక్టర్ బాబీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కెరియర్ లోనే “వాల్తేరు వీరయ్య” ఒక మైలురాయి సినిమాగా నిలిచిపోతుందని తెలిపారు. సినిమాలో వీరయ్య పాత్ర అందరిని ఆకట్టుకుంటుందని.. సన్నివేశాలలో కనిపించకపోయినా గాని రోమాలు నెక్కబడుచుకునేలా ఉంటుందని చెప్పుకొచ్చారు. “వాల్తేరు వీరయ్య” గ్యారెంటీ సూపర్ డూపర్ హిట్ అని ధీమా వ్యక్తం చేశారు.

త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అవుతుంది. ప్రీ రిలీజ్ వేడుక విశాఖపట్నంలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా సరిగ్గా ఈ సినిమా రిలీజ్ కి ముందు బాలకృష్ణ “వీరసింహారెడ్డి” విడుదలవుతోంది. సో ఈ రెండు సినిమాల మధ్య సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ నెలకొంది. ఈ రెండు సినిమాలలో ఏది పై చేయి సాధిస్తుందో చూడాలి.