సినిమా

The Warrior: రామ్‌-కృతి శెట్టిల `బుల్లెట్ సాంగ్` బ‌డ్జెట్ తెలిస్తే మైండ్‌బ్లాకే!

Share

The Warrior: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కృతి శెట్టి తొలిసారి జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `ది వారియ‌ర్‌`. కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుస్వామి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తుండగా.. అక్షర గౌడ మరొక కీలక పాత్రలో క‌నిపించ‌బోతోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు అందిస్తున్నాడు.

షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం జూలై 14న తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేందుకు ఇప్ప‌టి నుంచే ఒక్కో అప్డేట్‌ను వ‌దులుతున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమాలో `బుల్లెట్..` అంటూ సాగే సాంగ్‌ను శుక్రువారం నాడు విడుదల చేశారు.

`కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెట్.. ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయెట్` అంటూ సాగే ఆ పాటను తమిళ హీరో శింబు ఆల‌పించ‌డం విశేషం. డీఎస్పీ మ్యూజిక్, శింబు వాయిస్‌తో పాటు రామ్‌, కృతి శెట్టిల ఎన‌ర్జిటిక్ డ్యాన్స్ ఈ సాంగ్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచాయి. దీంతో ఇప్పుడీ ఈ సాంగ్ భారీ వ్యూస్‌ను అందుకుంటూ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.

ఇదిలా ఉంటే.. ఈ `బుల్లెట్‌` సాంగ్‌కు చిత్ర టీమ్ పెట్టిన బ‌డ్జెట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే, ఈ ఒక్క పాట చిత్రీక‌ర‌ణ కోస‌మే మేక‌ర్స్ ఏకంగా రూ. 3 కోట్లు వెచ్చించార‌ట‌. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు లింగ‌స్వామి స్వ‌యంగా తెలిప‌డంతో.. నెటిజ‌న్లు మైండ్‌బ్లాక్ అయిపోయింది. ఏదేమైనా ఒక్క సాంగ్‌కే మూడు కోట్లంటే మామూలు విష‌యం కాద‌నే చెప్పాలి.


Share

Related posts

Intinti Gruhalakshmi: నందుకు ఎదురుతిరిగిన లక్కీ.. తులసిని అవమానించిన గాయత్రి.. అదిరిపోయే ప్లాన్ చెప్పిన లాస్య.!? 

bharani jella

CPI Narayana: సినిమా టికెట్ ల వివాదం… చిరు.. జగన్ భేటీలపై సీపీఐ నారాయణ కీలక కామెంట్స్…

somaraju sharma

Vakeel saab prime Video: వకీల్ సాబ్ ప్రైమ్ వీడియో వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar