థియేటర్స్ కావాలి బాబు…

Share

శతమానం భవతి సినిమాతో హిట్ ఇచ్చి సంక్రాంతికి మంచి ఊపులో ఉన్న నిర్మాత దిల్ రాజు ఈ సంవత్సరం కూడా గత సంవత్సరంలాగే తన సినిమాని విడుదలకి సిద్ధం చేశాడు. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో… వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా , మెహరీన్ జంటగా నటించిన చిత్రం ఎఫ్ 2. పొంగల్ బరిలో నిలవనున్న ఈ సినిమా కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది కాబట్టి ఫ్యామిలి ఆడియన్స్ రిపీటెడ్ గా వచ్చే అవకాశం ఉంది, కానీ పెద్ద సినిమాల మధ్య భారీ ఓపెనింగ్స్ రాబట్టడం మాత్రం ఒకింత కష్టమనే చెప్పాలి. ఇదే సంక్రాంతికి వరుణ్ తేజ్ కి గట్టి పోటీ మరో మెగా హీరో నుంచే కావడం విశేషం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మొదటి సారి కలిసి చేస్తున్న సినిమా వినయ విధేయ రామ. ఈ మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు సాలిడ్ హిట్ అందుకోవాలని చరణ్బోయపాటి చూస్తున్నారు అయితే ఇంత యాక్షన్ సినిమాని ఓవర్సీస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఎంత వరకూ వినయ విధేయ రామ సినిమాని చూస్తారు అనేది చూడాలి.

ఇక బాషా తర్వాత సంక్రాంతి రేస్ లో నిలబడని రజినీకాంత్, ఈసారి తన లేటెస్ట్ మూవీ పేటతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన పేట చిత్రం నుంచి బయటకి వచ్చిన అన్ని ప్రమోషనల్ స్టఫ్ లోనూ ఫ్యాన్ మూమెంట్స్ ఎక్కువగా ఉండటం, ఈ చిత్రంపై రోజురోజుకి అంచనాలు పెంచేస్తున్నాయి. పైన చెప్పిన మూడు సినిమాలు ఒకెత్తు అయితే ఎన్టీఆర్ బయోపిక్ ఒకెత్తు. అన్నగారి జీవితాన్ని, కొడుకు బాలకృష్ణ ప్రపంచానికి చూపించాలనే సంకల్పంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. బీ,సీ సెంటర్స్ లోని ఆడియన్స్ ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకి ప్రధాన బలం. బాలయ్య ఫాలోయింగ్, ప్రేక్షకుల్లో ఎన్టీఆర్ రామారావ్ పై ఉన్న అభిమానం… రెండూ కలిసి ఈ సినిమాని సంక్రాంతి రేస్ లో బలమైన సినిమాగా నిలబెట్టాయి. మిగిలిన సినిమాలు ఏ మాత్రం తేడా కొట్టిన, ఎన్టీఆర్ బయోపిక్ క్లీన్ హిట్ అందుకోవడం ఖాయం.

ఇదిలా ఉంటే గత కొంత కాలంగా ఎన్నో చిన్న చిత్రాలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సైలెంట్గా వచ్చి బ్లాక్ బస్టర్ అవ్వడం కూడా మనం చూశాం అయితే ఇప్పుడు పరిస్థితి వేరు ఈసారి పండుగకి వచ్చేవన్నీ పెద్ద సినిమాలే… అందరూ స్టార్ హీరోలే. నాలుగు భారీ చిత్రాలు పోటీ పడుతుండటంతో తమ అభిమాన హీరో సినిమాకి ధియేటర్ లు ఎక్కువగా దొరకవని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు, ఓపెనింగ్స్ సరిగ్గా రావనే వారి భయంలో నిజముంది కానీ కొంతమంది సినీ అభిమానులకు మాత్రం ప్రతి సంక్రాంతికి సినిమాలు ఇదే స్థాయిలో ప్రేక్షకుల వస్తుంటాయి, కాబట్టి ఏ సినిమా బాగుంటే ఆ సినిమా హిట్ అవుతుంది, సో ఒకవేళ రిలీజ్ సమయంలో థియేటర్లు దొరక్కపోయినా మెల్లగా పుంజుకునే అవకాశం అయితే ఉందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు.


Share

Related posts

Vakeel Saab : వకీల్ సాబ్ నుంచి మరో వీడియో సాంగ్.. రిలీజ్ ఎప్పుడంటే..!!

bharani jella

రాశీఖన్నా అందుకు ఒప్పుకుంటే గ్రేటే ..?

GRK

Jr. NTR: తారక్ కు కరోనా నెగిటివ్..!! 

bharani jella

Leave a Comment