‘ లైంగికంగా వేధించకండి .. బతకానివ్వండి ‘ రష్మి చెప్పినదాంట్లో న్యాయం ఉంది ..!!

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే కామెడీ ఎంటర్ టైనర్ గా “జబర్దస్త్” ప్రోగ్రాం అన్నిటికంటే ముందు ఉంటది. టిఆర్పి రేటింగ్ లో జబర్దస్త్ షోకి ఎదురు ఉండదు. అంతగా గత కొన్ని సంవత్సరాల నుండి ఆదరణ పొందుతున్న ఈ షోలో యాంకర్ గా రష్మీక మంచి పాపులారిటీ ప్రేక్షకులలో ఉంది. ముఖ్యంగా “జబర్దస్త్” కంటెస్టెంట్ సుడిగాలి సుదీర్ రష్మీ ట్రాక్ గత కొన్ని సంవత్సరాల నుండి నడుస్తూనే ఉంది.

Anchor Rashmi Gautam Birthday Celebration video | Rashmi Celebrates her  birthday with Dogs | IB9TV - YouTubeఅదే విధంగా తన డ్రస్సింగ్ తో హాట్ హాట్ అందాలతో రష్మి ప్రేక్షకులను ఎంతగానో హాట్ బామ్మగా కుర్రకారు హృదయాలను ఎంతగానో ఆకట్టుకుంది. ఇటువంటి రష్మిక సినిమాలలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అంతగా రాణించలేక పోయింది. కానీ టెలివిజన్ రంగంలో పలు షోలలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. కానీ నిజజీవితంలో రష్మి జీవించే విధానం చాలా వేరుగా ఉంటుంది. కుటుంబ సభ్యులు పెంపుడు జంతువులే తన లోకం గా భావిస్తూ ఉంటుంది.

 

ఇటీవల లాక్డౌన్ సమయంలో చాలామంది ఇండస్ట్రీకి చెందిన వాళ్లు పలురకాల సహాయాలు చేయటం తెలిసిందే. ఇలాంటి తరుణంలో రష్మి వీధులలో ఉండే కుక్కలకు ఎవరు ఆహారం పెట్టే పరిస్థితి లేని తరుణంలో స్వయంగా ఆమె వెళ్లి తన టీం తో కలిసి తన ఇంటి దగ్గరలో ఉండే పెట్స్ కి ఆహారం పెడుతూ అండగా నిలబడింది. అంతేకాకుండా పెట్స్ ఆర్గనైజేషన్ తో కలిసి యాక్టివ్ గా ఉంటూ కుక్కలకు ఉండే సమస్యలను పరిష్కరిస్తూ ఉంటుంది.

 

ఇటువంటి తరుణంలో కుక్కల ఉత్పత్తి కోసం కొంత మంది యజమానులు వాటిని బలవంతంగా లైంగికంగా పెడుతుండటం పై సోషల్ మీడియాలో రష్మి సీరియస్ అయింది. లైంగికంగా వేధించడండి బతకనివ్వండి అవి మూగజీవాలు వాటినీ మనమే అర్థం చేసుకోవాలి అన్నట్టుగా రేష్మి కామెంట్ పెట్టింది. దీంతో చాలా మంది నెటిజన్లు రష్మీ చెప్పిన దాంట్లో న్యాయం ఉంది అంటూ…. సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.