Mahesh Babu: దగ్గర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో “బాహుబలి” వచ్చాక సౌత్ సినిమా హీరోలు పాన్ ఇండియా ప్రాజెక్టులు ఎక్కువ చేస్తున్న సంగతి తెలిసిందే. “బాహుబలి” దెబ్బతో సౌత్ ఇండియా కి ప్రపంచవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున మార్కెట్ పెరిగింది. ముఖ్యంగా తెలుగు హీరోల సినిమాలకి… వరల్డ్ వైడ్ గా భారీ గిరాకి ఏర్పడింది. దీంతో చాలా వరకు టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా మార్కెట్ దృష్టిలో పెట్టుకుని సినిమాలు ఒప్పుకుంటున్నారు. బన్నీ నటించిన పుష్ప… ఇటీవల వచ్చిన “ఆర్ఆర్ఆర్” అన్నీ కూడా పాన్ ఇండియా నేపథ్యంలో రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్.. దక్కించుకున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా మార్కెట్ లో భాగంగా హిందీ లో టాలీవుడ్ హీరోలు మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతూ ఉన్నారు.
రాజమౌళికి అదేవిధంగా ప్రభాస్ కి సపరేట్ మార్కెట్ హిందీ లో ఉంది. “ఆర్ఆర్ఆర్” హిట్ తో చరణ్ అదేవిధంగా ఎన్టీఆర్కి కూడా ఇప్పుడు మార్కెట్ వచ్చింది ఇటువంటి తరుణంలో మహేష్ బాబు కూడా హిందీలో డైరెక్ట్ సినిమాలు చేస్తే బాగుంటుంది అనే టాక్ బలంగా వినబడుతుంది. ఈ వాదన ఇప్పుడే కాదు “పోకిరి” హిట్ అయిన తర్వాత ఇంకా “బిజినెస్ మాన్” వంటి సినిమాలు విజయాలు సాధించిన తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్ట్రైట్ గా మహేష్ బాబు సినిమా చేయడానికి ఒప్పుకుంటే చాలామంది దర్శకులు నిర్మాతలు తెరకెక్కించడానికి రెడీగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ మొదటి నుండి మహేష్ బాబు తెలుగులోనే సినిమాలు చేస్తాను కొనసాగిస్తాను అని చెప్పుకొస్తున్నారు.
అయితే ఇటీవల తెలుగు హీరోలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు ఒప్పుకుంటూనే హిందీ ని దృష్టిలో పెట్టుకుని సినిమాలకి ఓకే చెబుతూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఇటీవల రీసెంట్ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ మహేష్ బాబుని.. మీరు డైరెక్ట్ హిందీ ఫిలిం చేయొచ్చుగా అని ప్రశ్నించాడట. అయితే మహేష్ ఏ మాత్రం నిమిషం కూడా ఆలోచించకుండా అసలు నాకు హిందీలో సినిమాలు చేసే ఆలోచన లేదు. తెలుగు సినిమాలు చేస్తాను. నా తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగా చాలా మంది చూస్తారు అనే ఆన్సర్ మహేష్ ఇచ్చినట్లు ఓ వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం మహేష్ సర్కార్ వారి పాట చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్టు స్టార్ట్ చేసే ఆలోచనలో ఉండగా.. నెక్స్ట్ రాజమౌళి అతి పెద్ద భారీ బడ్జెట్ సినిమా మహేష్ చేయనున్నట్లు సమాచారం.