ఒక్క సినిమా లేదు.. కానీ ‘లాక్ డౌన్’లో భారీగా సంపాదించింది.. ఎలా అంటే?

ఏ మాయచేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసింది అందాల బామ సమంత. ఏ పాత్రలు ఇచ్చినా ఇట్టే తన ప్రతిభను కనబరుస్తూనే ఉంది ఈ బామ. భారీ సినిమాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ గత కొంత కాలంగా తన సినిమా దూకుడును తగ్గించేసింది. లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచీ మూవీలకు బ్రేక్ వేసిన సమంత లాక్ డౌన్ ముగిసినా, సినిమా ఇండస్ట్రీ రీ ఓపెన్ అయినా కాని వాటి వైపు మాత్రం వెళ్లడం లేదు. కాగా లాక్ డౌన్ తర్వాత ఒక సినిమాకు ఒప్పుకున్నా దాన్ని కూడా చేయనని చెప్పిందట.

ఇదిలా ఉండగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టులు పెడుతూ, తమ ఇంట్లో మొక్కలు పెంచుతూ ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. ఇదిలా ఉండగా సినిమాల్లో ప్రస్తుతం నటించక పోయినా ఆదాయం మాత్రం భారీగానే పొందుతుంది. సినిమాలు చేయకున్నా ఎలాగ ఆదాయం సంపాధిస్తుందని మీకు డౌట్ రావచ్చు. కాని అది నిజం.. సినీ ఇండస్ట్రీలో తనకున్న పేరే ఆదాయన్ని తెచ్చిపెడుతుంది మరి..

సౌత్ ఇండియాలో సమంతాకు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. తన క్రేజ్ తోనే కదా పాపులారిటీ తో పలు సంస్థలు ఆమెను బ్రాండ్ అంబాసీడర్ గా తీసుకుంటున్నారు. ఈ యాడ్స్ తోనే సమంత ఏడాదికి భారీ ఆదాయం సంపాదిస్తోంది మరి. ఈ అండార్స్ మెంట్లే కాకుండా ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టినా సమంతకు లక్షల్లో ఆదాయం వచ్చి పడుతోంది.

తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ యాడ్స్ లు చేస్తూ అత్యధికంగా ఆదాయాన్ని అర్జించేది హీరోల్లో అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు అయితే హీరోయిన్లలో మాత్రం మన అక్కినేని సమంతేనట. అదంతా తన ప్రతిభవల్లే కావచ్చు. కాని బామ తీసే సినిమాలతో జనాలందరినీ తన వైపు ఆకర్షించుకుంటోది. చూడాలి మరి మున్మందు ఈ అందాల బామ ఏ విధంగా జనాలను ఆకట్టుకుంటుదనేది.