పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళ విరామం తర్వాత వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్, కోలీవుడ్ లలో 100 కోట్ల కి పైగా వసూళ్ళు సాధించి సంచలన విజయం అందుకున్న పింక్ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కుతుంది. అమితాబ్ బచ్చన్ .. అజిత్.. పోషించిన పవర్ ఫుల్ లాయర్ గా వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తుండగా బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇక నాని తో ఎంసిఎ సినిమాని తెరకెక్కించిన వేణు శ్రీరాం ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తర్వాత నివేదా థామస్ చాలా పాపులర్ అవుతుందన్న టాక్ మొదలైంది. ఇక శృతి హాసన్ గెస్ట్ రోల్ లో కనిపించనుందని కేవలం ఒక సాంగ్ కొన్ని కీలక సన్నివేశాలలో మాత్రమే కనిపించనుందని సమాచారం.
ఇక ఈ సినిమాకి దాదాపు టాకీ పార్ట్ మొత్తం కంప్లీటవగా కేవలం పవన్ కళ్యాణ్ మీద తీయాల్సిన కోర్ట్ సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ అని అవి కూడా త్వరలో పూర్తి చేస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా వకీల్ సాబ్ నుండి పవన్ కళ్యాణ్ లుక్ లీకయింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ లుక్ ఎలా బయటకు వచ్చిందన్నది మాత్రం అర్థం కావడం లేదని చిత్ర యూనిట్ చెబుతున్నారట. కాని కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాకి క్రేజ్ తీసుకు రావడం కోసం సినిమా ఇప్పట్లో రిలీజ్ కాదు కాబట్టి కొన్నాళ్ళిలా లీకులతో ఫ్యాన్స్ ని హోల్డ్ చేయొచ్చన్న ఆలోచనతో యూనిట్ లో ఉన్న ఒకరు లీక్ చేశారన్న టాక్ కూడా ఉంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని గతంలో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది ఏకంగా గంట సినిమా లీకయి యూనిట్ కి చమటలు పట్టించింది. అయినా 100 కోట్లు వసూళ్ళు రాబట్టి సంచనలన విజయం అందుకుంది.