సినిమా

Female Villains: విల‌నిజం చూపించి ప్రేక్ష‌కుల మ‌తిపోగొట్టిన హీరోయిన్లు వీళ్లే!

Share

Female Villains: ఒక సినిమాకు హీరో ఎంత అవ‌స‌ర‌మో హీరోయిన్ కూడా అంతే ముఖ్యం. కానీ, చాలా సినిమాల్లో హీరోయిన్లు కేవ‌లం గ్లామ‌ర్ షోకే ప‌రిమితం అయిపోతున్నారు. అయితే కొంద‌రు హీరోయిన్లు మాత్రం త‌మ‌ అంద‌చందాల‌తో ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు.. విలనిజం చూపించి ప్రేక్ష‌కుల మ‌తిపోగొట్టారు. మ‌రి ఆ హీరోయిన్లు ఎవ‌రు..? ఏయే సినిమాల్లో వారు విల‌న్‌గా న‌టించారు..? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

they are the heroines who show villainism and seduce the audience
they are the heroines who show villainism and seduce the audience

సౌందర్య: తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళ భాషలలో వంద‌కు పైగా చిత్రాలు చేసి భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న దివంగ‌త న‌టి సౌంద‌ర్య‌.. హీరోయిన్‌గానే కాదు ఓ చిత్రంలో విల‌న్‌గానూ న‌టించింది. అదే `నా మనసిస్తా రా`. శ్రీ‌కాంత్ హీరోగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో విలన్ షేడ్స్ కలిగిన పాత్రని సౌంద‌ర్య అద్భుతంగా పోషించి మంచి మార్కుల‌ను వేయించుకుంది.

they are the heroines who show villainism and seduce the audience
they are the heroines who show villainism and seduce the audience

రమ్యకృష్ణ: గ్లామ‌ర్ హీరోయిన్‌గా కుర్ర‌కారును అల్లాడించిన ర‌మ్య‌కృష్ణ‌.. సూప‌ర్ స్టార్ రజనీకాంత్‍ హీరోగా తెర‌కెక్కిన `నరసింహ` సినిమాలో నీలాంబరిగా త‌న‌లోని విల‌నిజం చూపించి అద‌ర‌గొట్టేసింది.

they are the heroines who show villainism and seduce the audience
they are the heroines who show villainism and seduce the audience

పాయల్ రాజ్ పుత్: ఈమె తొలి చిత్ర‌మైన `ఆర్ఎక్స్ 100`లోనే నెగెటివ్ రోల్ పోషించి విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది. అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో కార్తికేయ హీరోగా న‌టించాడు.

they are the heroines who show villainism and seduce the audience
they are the heroines who show villainism and seduce the audience

త్రిష: ధ‌నుష్ హీరోగా రూపుదిద్దుకున్న `ధర్మయోగి` చిత్రంలో త్రిష‌.. రాజకీయంలో పదవి కంటే ఏదీ ముఖ్యం కాదనుకునే నెగ‌టివ్ పాత్ర‌ను పోషించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.

they are the heroines who show villainism and seduce the audience
they are the heroines who show villainism and seduce the audience

తమన్న భాటియా: మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఈ మ‌ధ్య విడుద‌లైన `మాస్ట్రో`లో విలన్‍ రోల్‌ను పోషించింది. నితిన్ హీరోగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో త‌మ‌న్నా న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి.

they are the heroines who show villainism and seduce the audience
they are the heroines who show villainism and seduce the audience

ఇక `చారులత` సినిమాలో ప్రియ‌మ‌ణి, అడివి శేష్ హీరోగా వచ్చిన ‘ఎవరు’ సినిమాలో రెజీనా కాసాండ్రా, `యుగానికి ఒక్కడు` సినిమాలో రీమా సేన్, `డాన్‌` సినిమాలో నిఖితలు సైతం నెగ‌టివ్‌ పాత్ర‌ను పోషించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు.

Share

Related posts

RGV: అరియానా, అషూలకు ఆర్జీవీ షాక్‌.. బిగ్‌బాస్‌లో ఈసారి స‌పోర్ట్ ఆ వ్య‌క్తికే!

kavya N

మ‌లేషియాలో బ్యాన్ అయిన క‌మ‌ల్ చిత్రం

Siva Prasad

Samantha : ఓరి నాయనో .. పుష్ప సినిమాలో పాట కోసం సమంత కి అంత అమౌంట్ ఇచ్చారా..?!

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar